కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు మరణిస్తున్నారు. ఒడిశాకు చెందిన ప్రముఖ శిల్పి, పద్మవిభూషణ్ గ్రహీత, రాజ్యసభ సభ్యుడు మహాపాత్ర మే 9 వ తేదీన కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన ఇద్దరు కుమారులకు కూడా కరోనా సోకింది. ఇద్దరు ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ బుధవారం రోజున చిన్న కుమారుడు ప్రశాంత కన్నుమూయగా, పెద్ద కుమారుడు జషోబంత ఈరోజు ఉదయం కన్నుమూశారు. పదిరోజుల వ్యవధిలో ఎంపీ మహాపాత్ర, ఆయన ఇద్దరు కుమారులు కరోనాతో మృతి చెందడం అందరిని కలిచివేస్తోంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉన్నదో చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా తీసుకోవచ్చు. రెండు రోజుల క్రితం యూపీ రెవిన్యూశాఖ మంత్రి విజయ్ కశ్యప్, నిన్నటి రోజున రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా మృతి చెందారు.