కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత కొనసాగుతోంది. ఆనందయ్య మందు వలన ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయూష్ కమిషనర్ రాములు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇవాళ ప్రభుత్వానికి ఆయూష్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో మరోసారి మందును ఆనందయ్య తయారు చేయనున్నారు. ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్ స్పందన పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆయూష్, ఐసీఎంఆర్ నివేదికల ఆధారంగా ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆనందయ్య మందు కోసం కరోనా రోగులు ఎదురుచూస్తున్నారు. కృష్ణపట్నంలో ప్రస్తుతం ఆంక్షలు కోనసాగుతున్నాయి. బయటి వ్యక్తులు కృష్ణపట్నం వెళ్ళకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.