గత ఏడాది నుంచి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా మహమ్మారికి కారణం చైనా అని, చైనా వైరస్, కుంగ్ ఫ్లూ వైరస్ అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పుడు ఆయన మాజీ కావడంతో చైనీస్ అమెరికా సామాజిక హక్కుల సంఘం కోర్టులో కేసు ఫైల్ చేసింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆసియా ప్రజలపై దాడులు జరుగుతున్నాయని సామాజిక హక్కుల సంఘం పేర్కొన్నది. ట్రంప్ పై రూ.166 కోట్ల రూపాయల దావా వేసింది. అయితే, ట్రంప్ సలహాదారులు దీనిని కొట్టిపారేస్తున్నారు.