దేశంలో కరోనా కేసులు గత కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. త్వరలోనే తిరిగి యధాస్థితికి రోజులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. కరోనా కేసుల తగ్గుదల ప్రభావం బంగారం ధరలపై స్ఫష్టంగా కనిపిస్తోంది. గత ఐదు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 వద్ద ఉన్నది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. […]
కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదరుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయట పడేందుకు టీకాలను అందిస్తున్నారు. అయితే, టీకా తీసుకోవడానికి ప్రజలు వెనకాడుతున్నారు. టీకా తీసుకుంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయిని, టీకా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి ప్రజలు భయపడుతున్నారు. అమెరికా నుంచి ఇండియా వరకు ప్రజల్లో ఇదేవిధమైన భయాలు ఉన్నాయి. ప్రజలను ఎంకరేజ్ చేసేందుకు ఎక్కడికక్కడ తాయిలాలను ప్రకటిస్తున్నారు. అమెరికాలో ఈ తాయిలాలు అధికం. ఇండియాలో కూడా […]
మేషం ఈ రోజు గ్రహాల స్థితి వల్ల శుభప్రభావాలు ఉంటాయి. ఫలితంగా పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పనిప్రదేశంలో నూతన హక్కులు ఉండవచ్చు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. కొడుకు లేదా కుమార్తే వివాహ విషయంలో ముందుకు సాగవచ్చు. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వృషభం ఈ రోజు వృషభ రాశి వారు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. కుటుంబ […]
కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా వ్యాక్సిన్ పూర్తిచేసినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొన్నది. తాజా డేటా […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చైనాలోని యువాన్ ప్రావిన్స్ లో ఉన్న గుహలు కారణం అని ప్రపంచం భావిస్తోంది. ఆ గుహల నుంచి వైరస్ ఊహాన్‌కు అక్కడి నుంచి ప్రపంచానికి విస్తరించినట్టు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యునాన్‌లో ఉన్న గుహలను పూర్తిస్థాయి భద్రత కల్పించిది చైనా. ఎవరిని అటువైపు వెళ్లనివ్వడంలేదు. చైనా అద్యక్షుడి అనుమతి ఉన్న పరిశోధకులకు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉంది. ఇక చైనా పరిశోధకులు […]
గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కమిషనరేట్ పరిధిలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధులు దాటాలంటే తప్పనిసరిగా పాసులు ఉండాలని పోలీసులు స్ఫష్టంచేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో పాసులు లేని వారిని కమిషనరేట్ సరిహద్దులు దాటనివ్వడం లేదు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఏ కమిషనరేట్‌లో లిమిట్ దాటాలన్నా పాసులు ఉండాలని, అత్యవసర సర్వీసులు, ఎసెన్సియల్ సర్వీసుల వారికి మాత్రమే పాసులు లేకుండా అనుమతులు ఉంటాయని పోలీసులు స్ఫష్టం చేస్తున్నారు. […]
కరోనా కాలంలో మాస్క్ తప్పనిసరి కావడంతో మాస్క్ లేకుండా ప్రజలు బయటకు రావడంలేదు. సర్జికల్ మాస్క్, గుడ్డ మాస్క్, ఎన్ 95 మాస్క్ లు వినియోగిస్తున్నారు. అయితే, కొంత మంది వెరైటీ వెరైటీ మాస్క్ లు వినియోగిస్తు మీడియాలో పాపులర్ అవుతుంటారు. ఇలానే ఓ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఓ బాబా ధరించిన హెర్బల్ మాస్క్ వైరల్‌గా మారింది. వేప, తులసీ ఆకులతో తయారు చేసిన […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి అనేక రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నాక అనేక దేశాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత నిబందనలు పాటించకపోవడంతో తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ఓ ఉదాహరణ సీషెల్స్. 98 వేల మంది జనాభా కలిగిన ఈ దేశంలో 61.4 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందించారు. […]
ఆనందయ్య మందుకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతిలోని ఆయుర్వేద కళాశాలలో పరిశోధన కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య దగ్గర మెడిసిన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు వైద్యలు. నిన్నటి రోజున 190 మందికి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. అయితే, ఫోన్ ద్వారా వివరాలు సేకరించే సమయంలో వైద్యులకు సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. కొంతమంది రోగులు స్థానిక ఆరోగ్యకార్యకర్తల నెంబర్లు ఇచ్చినట్టు వైద్యుల […]
సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో తమకు తోచిన పోస్టులు పెడుతూ కొంతమంది ప్రైవసీకి విఘాతం కల్పిస్తుంటారు. అలాంటి వారిపై కొన్నిసార్లు పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై సీఐడీ దర్యాప్తు చేసేందుకు సిద్దమయింది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసత్య ప్రచారం చేస్తుండటంతో, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. కుట్రపూరితంగా న్యాయమూర్తులపై కేసులు పెడుతున్నారని సీఐడీకి […]