దేశంలో కరోనా కేసులు గత కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. త్వరలోనే తిరిగి యధాస్థితికి రోజులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. కరోనా కేసుల తగ్గుదల ప్రభావం బంగారం ధరలపై స్ఫష్టంగా కనిపిస్తోంది. గత ఐదు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 వద్ద ఉన్నది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.76 వేల వద్ద స్థిరంగా ఉన్నది. బంగారం ధరలు ఐదు రోజుల నుంచి స్థిరంగా ఉండటంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.