కరోనా కాలంలో మాస్క్ తప్పనిసరి కావడంతో మాస్క్ లేకుండా ప్రజలు బయటకు రావడంలేదు. సర్జికల్ మాస్క్, గుడ్డ మాస్క్, ఎన్ 95 మాస్క్ లు వినియోగిస్తున్నారు. అయితే, కొంత మంది వెరైటీ వెరైటీ మాస్క్ లు వినియోగిస్తు మీడియాలో పాపులర్ అవుతుంటారు. ఇలానే ఓ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఓ బాబా ధరించిన హెర్బల్ మాస్క్ వైరల్‌గా మారింది. వేప, తులసీ ఆకులతో తయారు చేసిన ఈ మాస్క్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వేప, తులసి లో ఉండే ఔషదాలు వైరస్‌ను చంపేస్తాయని, ఇంతకు మించిన మాస్క్ మరోకటి లేదని ఆ బాబా చెబుతున్నాడు. బాబా ధరించిన హెర్బల్ మాస్క్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.