కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నాక అనేక దేశాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత నిబందనలు పాటించకపోవడంతో తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ఓ ఉదాహరణ సీషెల్స్. 98 వేల మంది జనాభా కలిగిన ఈ దేశంలో 61.4 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందించారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నామనే భరోసాతో ప్రజలు భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటివి చేయలేదు. మే 1 నుంచి విదేశీ పర్యాటకులకు ద్వారాలు తెరిచింది. విదేశీ పర్యాటకులు ఆర్టీపీసీఆర్ నెగెటీవ్ సర్టిఫికెట్ ఉంటే ఎలాంటి క్వారంటైన్ నిబంధనలు లేకుండానే దేశంలో పర్యటించేందుకు అనుమతులు ఇచ్చింది. మే 1 తరువాత క్రమంగా మరలా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కొన్నిరోజులు తప్పనిసరిగా మస్క్ లు ధరించాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు పేర్కొన్నారు. కొత్తగా కేసులు నమోదయ్యి ఆసుపత్రుల్లో చేరిన వారిలో 20శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారే ఉండటం విశేషం. ప్రజల నిర్ణక్ష్యం కారణంగానే దేశంలో మళ్లీ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.