మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్‌చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ తో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చేరికలు చేరాయి. బీజేపీ చేరిన తరువాత ఈటల మాట్లాడారు. […]
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అవలంభిస్తున్నారు. కరోనా రోగులను గుర్తించి వారిని మిగతా వాళ్లనుంచి దూరంగా ఉంచి ట్రీట్‌మెంట్ చేస్తే కరోనా చెయిన్ ను బ్రెక్ చెయవచ్చు. అయితే, కరోనా రోగులకు గుర్తించడం పెద్ద సమస్యగా మారింది. శరీరంలో కరోనా వైరస్ ఉన్నప్పటీకీ లక్షణాలు కనిపించకపోవడంతో మాములు వ్యక్తుల్లో కలిసి మెలిసి తిరుగుతున్నారు. దీంతో ఇతరులకు కరోనా సోకుతున్నది. అయితే, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు శరీర వాసనలతో కరోనాను గుర్తించే పరికరాన్ని […]
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆల్‌టైమ్ స్థాయిలో ధరలు నమోదయ్యాయి. లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు పెరగ్గా, డీజిల్‌పై 31 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో రూ.100.26 పైసలకు చేరింది. పెరిగిన పెట్రోల్ ధరలపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన సంగతి తెలిసిందే. దేశంలో పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ ఆంధోళనలు చేస్తున్నది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ […]
గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయలుకు చేరింది. దీంతో సామాన్యులు పెట్రోల్ కొనుగోలు చేయాలంటే ఆలొచిస్తున్నారు. పెట్రోల్ ధరలకు భయపడి బయటకు రావడమే మానేశారు. పెట్రోల్ ధరలకు భయపడిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి 10 వేల రూపాయలు ఖర్చుచేసి జట్కాబండిని తయారు చేసుకున్నాడు. స్వతహాగా అతను రజకుడు కావడంతో నిత్యం దుస్తులను సేకరించేందుకు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నది. దీంతో రజకుడు […]
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో రోజుకు ముడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 70 వేలకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 70,421 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. ఇందులో 2,81,62,947 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,73,158 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 […]
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడెన్‌గా పాకిస్తాన్ లో ప్రత్యక్షం అయ్యారు. అందులోనూ పాక్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వీధుల్లో కుల్ఫీలు అమ్ముతున్నాడు. సడెన్ చూసిన వారు.. ఇదేంటి ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నారు అని అనుకొవచ్చు. కానీ అతను ట్రంప్ కాదు. ట్రంప్‌కు దగ్గర పోలికలతో ఉన్న వ్యక్తి. పాక్ వీధుల్లో కుల్ఫీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ట్రంప్ పోలికలతో ఉండటంతో అతడిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు […]
సమ్మర్ వచ్చింది అంటే పర్యాటకులు హిల్ స్టేషన్‌లకు క్యూలు కడుతుంటారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన హిల్ స్టేషన్లలో ఒకటి సిమ్లా. గతేడాది కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో సమ్మర్ సమయంలో పర్యాటకు పెద్దగా కనిపించలేదు. ఈ ఏడాది కూడా మార్చి నుంచి దేశంలో సెకండ్ వేవ్ మహమ్మారి విలయతాండవం చేసింది. దీంతో ఈ ఏడాది జూన్ వరకు హిమాచల్ ప్రదేశలో పలు ఆంక్షలు విధించారు. అయితే, కారోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో సిమ్లాలో ఆంక్షలు సడలించారు. ఉదయం […]
హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఉదయం 11ః30 గంటలకు బీజేపీలో చేరబోతున్నారు. ఉదయాన్నే ఈటల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢల్లీకి బయలుదేరారు. ఈటలతో పాటుగా మరో 20 మంది కూడా అదే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ జాతీయ ఆధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల, ఆయన అనుచర వర్గం బీజేపీలో చేరనున్నారు. దేవరయాంజల్ భూములను ఈటల అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను […]
ఇజ్రాయిల్ ప్రధానిగా బెన్నెట్ ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు పార్టీ ఒటమిపాలైంది. ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో భిన్నమైన సిద్దాంతాలు కలిగిప ప్రతిపక్షపార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ పార్టీలు తమ నాయకుడిగా బెన్నెట్ ను ఎంచుకున్నాయి. దీంతో బెన్నెట్ ఇజ్రాయిల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇజ్రాయిల్-గాజా మధ్య వివాదానికి తెరపడే అవకాశం ఉందని పాలస్తీనా ప్రజలు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా […]