కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రపంపచంలో కరోనా మహమ్మారి తీవ్రంగా దేశాలకు బిలియన్ డోసులను అందించబోతున్నట్టు యూకే ప్రకటించింది. జీ7 లోని సభ్యదేశాలు మిగులు వ్యాక్సిన్‌లను ఇతర దేశాలకు అందించేందుకు అంగీకరించాయని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బిలియన్ డోసుల్లో 75శాతం ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కోవాక్స్ ద్వారా సభ్యదేశాలకు అందజేయనున్నారు. అదే విధంగా, మిగిలిన 25శాతం టీకాలను ఇతర మార్గాల్లో దేశాలకు అందజేస్తామని ప్రకటించాయి. ఇప్పటికే పేద దేశాలకు 500 మిలియన్ డోసులను ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది. అదే విధంగా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు కూడా వ్యాక్సిన్ డోసులను అందించేందుకు ముందుకు వచ్చాయి.