తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. ఒకవైపు వేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో, ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిసారించింది. సీఎం కేసీఆర్ ఈరోజు జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమావేశం అయ్యారు. పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై సీఎం సమీక్షను నిర్వహించారు. జులై 1 నుంచి రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏ పని కూడా పెండింగ్ ఉండటానికి వీల్లేదని సీఎం కేసీఆర్ అధికారులను […]
కరోనా కాలంలో అన్ని రంగాలు అనేక ఇబ్బందులు పడ్డాయి. సవ్యంగా సగుతున్నాయని అనుకున్న రంగాలు సైతం కరోనా దెబ్బకు కుదేలయింది. ఇక, బ్యాంకుల వద్ద నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో వ్యాపార సంస్థల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే, దేశంలోని నాలుగు బ్యాంకులు మాత్రం కరోనా కాలంలోనూ లాభాలబాట పట్టాయి. 2021 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు లక్ష కోట్లరూపాల మేర లాభాలు ఆర్జించాయి. Read: ఇండియన్ ఐడల్ 12 […]
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ లైవ్ మ్యాటర్ అనే ఉద్యమానికి దారి తీసింది. వర్ణ వివక్షను నిరసిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారులను ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించారు. కాగా వీరిపై కేసులు నమోదు చేయడంతో కోర్టు విచారణ జరిపింది. Read: కేంద్రంతో ట్విటర్ గేమ్ ఆడుతోందా ? జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే 2021-22 కు సంబందించిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామనే సమగ్రసమాచారాన్ని పొందుపరచింది. ఈ జాబ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు సంబందించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది. Read: ‘అఖండ’ ప్రత్యేక గీతంలో రత్తాలు! పోటీ పరీక్షల్లో పారదర్శకత ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోటీ పరీక్షలు […]
నైరుతీ రుతుపవనాల కారణంగా దేశంలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కరోనా విజృంభణతో అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేయడంతో ఎక్కడికక్కడ రాకపోకలు చాలా కాలంపాటు బంద్ అయ్యాయి. దీంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో వర్షాలు కురుస్తున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. Read: ‘భయానక భవనం’ నిర్మిస్తానంటోన్న ‘బ్లాక్ విడో’! గంటల వ్యవధిలోనే 145 మీమీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అంతేకాదు, బీహార్ […]
కరోనా కేసులు ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి ఉత్పరివర్తనం చెంది వివిధ వేరియంట్‌లుగా మారుతున్నది. ఇలా మారిన వాటిల్లో డెల్టా వేరియంట్ భౌగోళిక ముప్పుగా అవతరించింది. సెకండ్ వేవ్ సమయంలో ఈ వేరియంట్ పెద్ద సునామిని సృష్టించింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ఇండియా బయటపడుతున్నది. ఇప్పుడు డెల్టా వేరియంట్ యూరప్ ను భయపెడుతున్నది. బ్రిటన్‌లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 35 వేలకు పైగా కేసులు […]
కరోనా విషయంలో ప్రపంచం అనేక ఇబ్బందులు పడుతుంటే, భూటాన్ మాత్రం కరోనాను కట్టడి చేయడంలో చురుకైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకుంటోంది. 7 లక్షలకు పైగా ఉన్న జనాభా కలిగిన భూటాన్ ఎత్తైన, కోండలు, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. ప్రజలు మైదాన ప్రాంతాల్లో కంటే కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివశిస్తుంటారు. అలాంటి చోట్ల కరోనా వ్యాపిస్తే పరిస్థతి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడం కూడా కష్టం అవుతుంది. […]
దేశంలో సెకండ్ వేవ్ ఉదృతికి ప్రధాన కారణం డెల్టా వేరియంట్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ వేరియంట్ ఇప్పుడు ఉత్పరివర్తనం చెంది డెల్టీ ప్లస్ వేరియంట్‌గా మారింది. దేశంలో ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదయ్యాయి. రెండు మరణాలు కుడా సంభవించాయి. కరోనా కేసులు, డెల్టా వేరియంట్లపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కొన్ని కీలక విషయాలను తెలిపారు. డెల్టాప్లస్ వేరియంట్‌పై ఆందోళన చేందాల్సిన అవసరం లేదని, తిరుపతిలో ఒక డెల్టా వేరియంట్ […]