కరోనా కాలంలో అన్ని రంగాలు అనేక ఇబ్బందులు పడ్డాయి. సవ్యంగా సగుతున్నాయని అనుకున్న రంగాలు సైతం కరోనా దెబ్బకు కుదేలయింది. ఇక, బ్యాంకుల వద్ద నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో వ్యాపార సంస్థల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే, దేశంలోని నాలుగు బ్యాంకులు మాత్రం కరోనా కాలంలోనూ లాభాలబాట పట్టాయి. 2021 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు లక్ష కోట్లరూపాల మేర లాభాలు ఆర్జించాయి.
Read: ఇండియన్ ఐడల్ 12 : టాప్ సింగర్స్ కి టీకాలు…
ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ 31,116 కోట్ల రూపాయల లాభం ఆర్జించగా, ఎస్‌బీఐ 20,410 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. 16,192 కోట్ల రూపాయలతో ఐసీసీఐ బ్యాంకు మూడో స్టానంలో ఉన్నది. ఐదేళ్ల కాలంలో తొలిసారిగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు లాభాలు ఆర్జించాయి. ఇక ఇదిలా ఉంటే, ప్రైవేట్ సెక్టార్‌లో యెస్ బ్యాంకు 3,462 కోట్ల మేర నష్టాలు చవిచూసింది.