కరోనా విషయంలో ప్రపంచం అనేక ఇబ్బందులు పడుతుంటే, భూటాన్ మాత్రం కరోనాను కట్టడి చేయడంలో చురుకైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకుంటోంది. 7 లక్షలకు పైగా ఉన్న జనాభా కలిగిన భూటాన్ ఎత్తైన, కోండలు, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. ప్రజలు మైదాన ప్రాంతాల్లో కంటే కొండ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివశిస్తుంటారు. అలాంటి చోట్ల కరోనా వ్యాపిస్తే పరిస్థతి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడం కూడా కష్టం అవుతుంది. కానీ, కష్టాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించింది భూటాన్.
Read: సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరోయిన్ కూతురు!
దీనికోసం భూటాన్ రాజు వాంగ్‌చుంగ్ నేరుగా రంగంలోకి దిగాడు. ఎత్తైన పర్వతాల్లో నివశిస్తున్న ప్రజలను కలుసుకుంటూ, వారికి కరోనా పై అవగాహన కల్పిస్తున్నాడు. కరోనా బారిన పడితే కలిగే ఇబ్బందులు, నష్టాల గురించి స్వయంగా రాజు వాంగ్‌చుంగ్ ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో ప్రజలు కూడా తాము ఒంటరిగా లేమని, రాజు తోడుగా ఉన్నాడనే భావన కలిగింది. దీంతో ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించారు. 4వేల అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ప్రజలకు సేవలు చేస్తున్న వైద్యసిబ్బందిని కలుసుకొని వారిని అభినందించేందుకు రాజు వాంగ్‌చుంగ్ ఐదు రోజులపాటు కాలినడకన పర్వత ప్రాంతాల్లో పర్యటించి వారికి అభినందనలు తెలిపారు. ప్రతి పర్యటన తరువాత రాజు వాంగ్‌చుంగ్ తప్పని సరిగా కరోనా నిబంధనల ప్రకారం హోక్వారంటైన్‌లో ఉండేవారు. ఇప్పటి వరకు ఆ దేశంలో 2 వేల మందికి కరోనా సోకగా, ఒక్కరు మాత్రమే కరోనాతో మృతి చెందారు. అంతేకాదు, ఆ దేశంలో 90శాతం మంది జనాభాకు కరోనా వ్యాక్సినేషన్‌ను అందించారు.