NTV WebDesk
Author- NTV Telugu-
తాలిబన్ల మరో సంచలన నిర్ణయం: అధికారులకు క్షమాభిక్ష…
నిన్నటి వరకు ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అరాచకపాలన మొదలౌతుందని, అనేక ప్రాంతాల్లో అప్పటికే ఆ తరహా పాలన మొదలైందని ప్రజలు భయపడ్డారు. నెల రోజుల క్రితం నుంచి తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కార్యాలయాలు, పాఠశాలలు తెరుచుకోకపోడంతో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదేవిధమైన పాలన కొనసాగుతుందని అనుకున్నారు. అయితే, అధికారం మార్పిడి జరుగుతున్న సమయంలోనే తాలిబన్ నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని, […] -
తాలిబన్ నేత కీలక ఆదేశాలు…కాబూల్‌లో సాధారణ పరిస్థితులు…
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత 2001 కి ముందు పరిస్థితులు వస్తాయోమో అని చెప్పి చాలామంది ప్రజలు దేశాన్ని వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాబూల్ ఎయిర్పోర్ట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. మరోవైపు ప్రభుత్వానికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. వీలైనంతవరకు దేశాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో తాలిబన్ నేతలు కీలక ప్రకటన చేశారు. ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని, ఆయుధాలు తీసుకోవద్దని, ప్రజల ఆస్తులను […] -
వారి కోసం కేంద్రం ఎమర్జెన్సీ వీసాలు…
కాబూల్‌లో ప్రస్తుం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఆ తరువాత ఎలాంటి సంఘటనలు జరుగుతాయే, మహిళలను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. అందుకోసమే వీలైనంత వరకు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఎంబసీలు మూసేయ్యడంతో విదేశాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీనికోసం భారత ప్రభుత్వం ఇ ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీనికోసం […] -
కాబూల్ నుంచి అధికారులను భారత్‌కు తరలింపు…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో రాజధాని కాబూల్‌లోని అన్ని దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసి స్వదేశం వెళ్లిపోతున్నాయి. అధికారులను, భద్రతా సిబ్బందిని స్వదేశానికి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కాబూల్ విమానశ్రయం నుంచి భారత రాయబార అధికారులు, భద్రతా సిబ్బంది 120 మందిని సీ 17 వైమానిక విమానం ద్వారా ఇండియాకు తరలించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు సీ 17 విమానం చేరుకున్నది. కాబూల్ నుంచి వచ్చిన వీరికి విదేశాంగ శాఖాధికారులు స్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న […] -
ప్రజలు పారిపోతుంటే… పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబన్లు…
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా భయం భయంగా తిరుగుతున్న ప్రజలు కనిపిస్తున్నారు. ఎవరు ఎటునుంచి వచ్చి కాల్పులు జరుపుతారో… ఎవర్ని ఎత్తుకుపోయి చంపేస్తారో.. ఏ మహిళ కనిపిస్తే ఏం చేస్తారో అని భయాందోళనల మధ్య కాలం వెల్లబుచ్చుతున్నారు. కాబూల్ నగరం చుట్టూ తాలిబన్లు పహారా కాస్తుండటంతో బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు. ఇప్పుడున్న ఏకైక మార్గం కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఏదోక దేశం వెళ్ళి తలదాచుకోవడమే. దీంతో పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్ ప్రజలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. […] -
ఆఫ్ఘన్ మొదటి మహిళా మేయర్ సంచలన వ్యాఖ్యలు… రండి…చంపండి…
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటి వరకు సాగిన పాలనకు పూర్తి విరుద్దంగా పాలన జరగబోతున్నది. తాలిబన్ల చేతిల్లోకి అధికారం వెళ్లిపోయింది. రెండు దశాబ్దాల క్రితం ఎలాంటి కౄరమైన పాలనను అక్కడి ప్రజలు చూశారో దాదాపుగా అదేవిధమైన పాలనలను మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు. తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతున్నప్పటికీ వారు ఎలాంటి పాలన అందిస్తారో అందరికీ తెలిసిందే. మహిళలు, చిన్నపిల్లలకు ఆ దేశంలో రక్షణ ఉండదు. 12 ఏళ్లు దాటిన మహిళలు ఎవరూ బయటకు రాకూడదు. చదువు […] -
మొదలైన ఆరాచక పాలన: ఇంటింటిని గాలిస్తున్న తాలిబన్లు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ఇంకా పూర్తిగా అధికారాన్ని చేజిక్కించుకోకముందే తమ ఆరాచక పాలనను మొదలుపెట్టారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తున్నారు. దీనికి సంబందించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబూల్‌లోని ప్రజలను ఏమీ చేయబోమని చెబుతూనే, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, యూఎస్ ఆర్మీకి సహకరించిన వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్లి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో కాబూల్ వాసుల్లో తెలియని భయం నెలకొన్నది. ఇప్పటి వరకు సాధారణ జీవనం […] -
ఇండియా కరోనా అప్డేట్: భారీగా తగ్గిన కేసులు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఇండియాలో 25,166 కేసులు నమోదవ్వగా, 437 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దాదాపు 5 నెలల తరువాత 25 వేల కేసులు నమోదవ్వడం విశేషం. ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.22 కోట్లకి చేరింది. తాజాగా కరోనా నుంచి 36,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.14 కోట్లకు చేరింది. […] -
భారత్‌లో త్వరలో మరో మూడు టీకాలు…
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తుండటంతో వేగంగా వ్యాక్సినేషన్ ను అమలు చేస్తున్నారు. దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా, మరో మూడు వ్యాక్సిన్లకు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. భారత్‌కు చెందిన జైడస్ క్యాడిలా, కోవాక్స్, స్పుత్నిక్ లైట్లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీకి ధరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మొదటగా భారత్‌కు చెందిన జైడస్ […] -
ఆఫ్ఘన్ నెత్తిన భూకంపం పిడుగు… పరుగులు తీసిన ప్రజలు…
అసలే తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మళ్లీ మద్యరాతి యుగంనాటి పరిస్థితులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న ప్రజలు తాలిబన్ల రాకతో ఉంటామా లేదా అని సందేహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నెత్తిన మరో ఉపద్రవం వచ్చిపడింది. ప్రకృతి కూడా వారికి సహకరించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.8గా నమోదైంది. ఫైజాబాద్‌కు 83 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. […]
తాజావార్తలు
-
Tollywood : టాలీవుడ్‌కు ఒక గట్టి గుణపాఠం నేర్పిన మా ఇంటి బంగారం, లెనిన్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Prithviraj Sukumaran: ఇతర భాషల్లో క్రేజ్… మాలీవుడ్‌లో తగ్గుతున్న పృథ్వీరాజ్ జోరు?
-
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
-
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!