పార్లమెంట్‌లో రైతు చట్టాలపై వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. రైతు చట్టాలను బ్యాన్ చేయాలని ఇప్పటికే రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించారు. పార్లమెంట్ ముట్టడిని మొదట ప్రకటించినప్పటికీ, ఆ తరువాత ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది. […]
దేశ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. మోడీని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తుండేవి. కానీ, పశ్చిమ బెంగాల్‌లో మమత ఒక్కరే తలపడ్డారు. గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ […]
ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ఇతర రాష్ట్రాల్లోకి మెల్లిగా ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నది. దేశంలో బీజేపీకి మెల్లిగా ఎదురుగాలులు వీస్తుండటం, కాంగ్రెస్ పార్టీ బలహీనపడతంతో ఆప్ ఎలాగైనా దీనీని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే ఆప్ హర్యానాలో పోటీ చేసింది. అదే విధంగా పంజాబ్ రాష్ట్రంలో కూడా అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఆప్ ఉచిత విద్యుత్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. Read: షూటింగ్ పూర్తి చేసుకున్న “శ్యామ్ సింగ రాయ్” […]
ప్రముఖ సినీనటి జయంతి ఈరోజు కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆమె శ్వాససంబంధమైన రుగ్మతతో బాధపడుతున్న జయంతి ఈరోజు మృతి చెందారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారుగా 500 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని బనశంకరీలోని తన నివాసంలోనే ఆనారోగ్యం కారణంగా మృతి చెందారు. 1968లో జైగూండు చిత్రంలో చిత్ర పరిశ్రమకు జయంతి పరిచయం అయ్యారు. 190 కన్నడ చిత్రాలతో సహా మొత్తం 500 లకు పైగా చిత్రాల్లో […]
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 39,361 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 35,968 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,05,79,106కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 416 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,20,967 మంది మృతి చేందారు. ఇక దేశంలో 4,11,189 […]
1999 మే 3 వ తేదీన ఇండియా పాక్ మధ్య వార్ ప్రారంభం అయింది. అంతకు ముందు 1999 ఫిబ్రవరిలో ఇండియా పాక్ మధ్య లాహోర్ శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇరు దేశాల సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులకు పాల్పడకూడదు. కానీ, పాక్ దీనిని పక్కన పెట్టి ముష్కరులను, సైనికులను కార్గిల్ నుంచి సరిహద్దులు దాటించి ఇండియాలోకి పంపంది. అప్రమత్తమైన ఇండియా వారిని ఎదుర్కొన్నది. గడ్డకట్టే చలిని సైతం […]
టోక్యో ఒలంపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు రాణిస్తున్నారు. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియా తొలి పతకం సాధించింది. మీరాభాయ్ చాను రజత పతకం సాధించారు. తనకు పిజ్జా అంటే చాలా ఇష్టం అని, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా… పిజ్జా తింటానా అని ఉందని చెప్పుకొచ్చారు. అయితే, మీరాభాయ్ చాను కు ప్రముఖ పిజ్జా కంపెనీ డామినోస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమెకు జీవితాంతం ఉచితంగా పిజ్జాను అందిస్తామని ప్రకటించింది. టోక్యో ఒలంపిక్స్‌లో భారత క్రీడాకారులు […]
బ్రిటన్‌లో కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ఇటీవలే ఆంక్షలను సడలించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వస్తున్నారు. అంతేకాదు, మస్క్ లేకుండా బయట తిరుగుతున్నారు. దీంతో మళ్లీ కరోనా భయం పట్టుకున్నది. ఒకవైపు డెల్టా వేరియంట్ విజృంభిస్తుంటే, మరోవైపు కొత్త వేరియంట్ భయం పట్టుకున్నది. బ్రిటన్‌లో తాజాగా బి.1.621 రకం వేరియంట్‌ను గుర్తించారు. 16 మందిలో ఈ కొత్త వేరియంట్ బయటపడింది. ఈ 16 కేసులు లండన్‌లో బయటపడ్డాయి. Read: తిండి ధ్యాసలో ఫ్లైట్ మిస్ […]