ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కార్పోరేషన్‌కు సంబందించి కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 47 డివిజన్లకు గాను మూడు డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన మూడు డివిజన్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 20 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 18 చోట్ల వైసీపీ విజయం సాధించగా, రెండు చోట్ల టీడీపి విజయం సాధించింది. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో 40కి పైగా డివిజన్లు కైవసం చేసుకుంటామని వైసీపీ […]
ఒకప్పుడు అతను కబడ్డీలో ఛాంపియన్. రాష్ట్రం తరపున కబడ్డీ పోటీల్లో అనేక పతకాలు సాధించాడు. పేద కుటుంబంలో పుట్టడం వలన తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. కొడుకు కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన చేయాతను అందించారు. వారి కష్టం ఊరికే పోలేదు. కొడుకు రాష్ట్రస్థాయిలో రాణించాడు. మంచి ప్రతిభను చాటుకున్నాడు. ఇదంతా గతం. ప్రస్తుతం తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉండటం వలన వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు బడ్డీకొట్టు నడుపుతున్నాడు. వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. Read: “ఛత్రపతి” […]
కేరళలో ఇటీవలే వలన్‌చెరిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎన్నికల్లో విజయం తరువాత పినరయి విజయన్ వర్గం ఓ పెద్ద హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. విష్ణు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన హోర్డింగులో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పినరయి విజయన్‌ను భగవంతునితో పోలుస్తూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. పినరయి విజయన్ ఫోటోతో పాటుగా కింద భగవంతుడు ఎవరని మీరు ప్రశ్నిస్తే ఆహారం అందించేవారని చెబుతారు అని రాసి ఉన్నది. దీనిపై ఎల్డీఎఫ్ స్పందించింది. […]
కరోనా మహమ్మారి జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడూ ఆఫీసులు వదలని వ్యక్తులు పాపాం ఇంటినుంచే పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. మహమ్మారి దెబ్బకు భయపడి అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిస్తాయిలో ఇంటినుంచి పనిచేసే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక ఇంటినుంచే పనిచేస్తుండటంతో ఇంతకు ముందులాగా స్వేచ్చ దొరకడంలేదు. గతంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు దొరికేవి. కానీ, ఇప్పుడు సాధ్యం కావడం […]
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పార్లమెంట్‌లో స్పష్టంచేసింది. దీంతో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం దిగిరాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ ప్రకటించింది. ఆర్చి నుంచి వడ్లపూడి నిర్వాసిత ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం […]
కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధానకారణమైన ముఖ్యమంత్రి యడ్డియూరప్ప ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారికి ముఖ్యమైన పదవుల్లో కొనసాగే అవకాశం లేదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన యడ్డియూరప్ప విషయంలో ఇప్పటికే రెండేళ్లు ఆగింది. రెండేళ్ల క్రితం మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో యడ్డియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్ల కాలంలో పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన రాజకీయ అనుభవంతో […]
రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంతర్గత సమస్యలకు చెక్ పెట్టి, అందర్ని ఏకం చేసేలా, అందరి మధ్య రాజీ కుదిర్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్. పంజాబ్‌లో ఈ విషయంలో దాదాపుగా విజయం సాధించిందని చెప్పాలి. పంజాబ్‌లో ముఖ్యనేతలైన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించింది. సిద్ధూకు పంజాబ్ పీసీసీ పగ్గాలు అప్పగించింది. దీంతో అక్కడ సమస్య చాలా వరకు ఓ కొలిక్కి […]
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్… ఇనుప నరాలు ఉన్న వంద మందిని ఇవ్వండి దేశాన్ని మార్చి చూపిస్తానని అన్నారు వివేకానందుడు. గుండె ధైర్యం, కండ బలం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అనుకున్నది సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కండబలం అంటే మగాళ్లకు ఉంటుందని అనుకుంటాం. కానీ, ఈ కాలంలో మగాళ్లకు ఆడవాళ్లు ఏ మాత్రం తీసిపోవడంలేదు. ప్రతి విషయంలో వారితో పోటీపడుతున్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన అలెసాండ్రా అల్విస్ అనే మహిళ ఓ పెద్ద […]
బీజేపీలో చేరిన ఈటలపై మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల అవినీతి నాయకుడని, అవినీతి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారని అలాంటి అవినీతి నాయకుడిని బీజేపీలో చేర్చుకుంటారని మోత్కుపల్లి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన దళితబంధు కార్యక్రమానికి మోత్కుపల్లి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తరువాత ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. అంతేకాదు, మోత్కుపల్లి బీజేపీకి కూడా రాజీనామా చేశారు. తనలాంటి వారు బీజేపీలో ఇమడలేరని, ఎమ్మెల్యేగా 30 ఏళ్ల అనుభవం […]