ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత రాజధాని ప్రాంతంలో రోడ్లు వేశారు. అయితే, ఇప్పుడు ఆ రోడ్లు ఉన్నట్టుండి మాయం అవుతున్నాయి. వేసిన రోడ్లను దొంగతనం చేస్తున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజమని స్థానికులు చెబుతున్నారు. రాత్రిసమయంలో కొంతమంది రోడ్లను తవ్వుకొని ఎత్తుకుపోతున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇదంతా అధికారపార్టీకి చెందిన వ్యక్తులే చేస్తున్నారని, రాజధానిగా అమరావతి ఉండటం వారికి ఇష్టంలేదని అందుకే అలా చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ఇది తమపని […]
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 61,298 శాంపిల్స్‌ను పరీక్షించగా, 1540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,57,932కి చేరింది. ఇందులో 19,23,675 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో 2,304 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 […]
ఇంటింటికి రేషన్ ను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9 వేలకు పైగా మినీ ట్రక్కులను కొనుగోలు చేసింది. ఈ ట్రక్కులను లబ్ధిదారులకు అందజేసింది. షెడ్యూలు కులాల వారికి ఈ ట్రక్కులను అందజేసింది. ఈ మినీ ట్రక్కులపై గతంలో ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ఇచ్చింది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారుడు పెట్టుకోవాలి. అయితే, ఇప్పుడు ఇందులో మార్పులు చేసింది ప్రభుత్వం. 60 శాతం ఉన్న సబ్సిడీని 90 శాతానికి పెంచింది. 10 శాతం మాత్రమే లబ్ధిదారుడు పెట్టుకోవాలి. […]
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు వయసుపైబడిన వారికి కరోనా టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదవ్వడానికి ఇదికూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లలోపున్న పిల్లలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెలలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు బీజేపీ ఎంపీలతో పీఎం మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ […]
ప్రపంచంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బయోగ్యాస్ వంటివి విరివిగా వాడుకలోకి వస్తున్నాయి. పరిశ్రమల్లో వినియోగించిన వ్యర్ధాలతో బయోడీజిల్, బయోగ్యాస్‌లను తయారుచేస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రఖ్యాతిగాంచిన విస్కీ తయారీ సంస్థ గ్లెన్ ఫెడిచ్ వ్యర్ధాలతో బయోగ్యాస్‌ను తయారు చేస్తున్నది. అలా తయారు చేసిన బయోగ్యాస్‌తో ట్రక్కులను నడుపుతున్నది. మాములు ఇంధనాల వాడకం వలన వచ్చిన కర్భన పదార్ధాల కంటే ఈ వ్యర్ధాలతో తయారుచేసిన బయోగ్యాస్‌తో విడుదలయ్యే వ్యర్ధాలు 95 శాతం మేర […]
2024లో నాసా చంద్రుని మీదకు మనిషిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబందించిన కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 2.9 బిలియన్ డాలర్లు. దీనికోసం స్పేస్ ఎక్స్ సంస్థ హ్యుమన్ ల్యాండింగ్ సిస్టంతో కూడిన రాకెట్‌ను తయారు చేస్తున్నది. అయితే, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు సంస్థ బ్లూఆరిజిన్ న్యూ షెపర్డ్ అనే వ్యోమనౌకను తయారు చేసింది. ఈ నౌకలోనే ఇటీవలే జెఫ్ బెజోస్, మరో ముగ్గురు అంతరిక్ష […]
కర్నాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. వయసు నియమావళి ప్రకారం బీజేపీ యడ్యూరప్పను తప్పించిందని బీజేపీ చెబుతున్నది. అధిష్టానం తనపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని, బీజేపీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేసినట్టు అటు యడ్యూరప్ప కూడా పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశాన్ని మరోలా చూస్తున్నాయి. ముఖ్యమంత్రిని బలవంతంగా తప్పించారని సెటైర్లు వేస్తున్నాయి. అవినీతి కారణంగానే ముఖ్యమంత్రిని తొలగించి చేతులు కడుక్కోవాలని కేంద్రం చూస్తున్నట్టు కాంగ్రెస్ […]
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నకు సమర్పించిన సంగతి తెలిసిందే. యడ్యూరప్ప రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తదుపరి ముఖ్యమంత్రి నియామకం జరిగే వరకు ఆయన్ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ తెలిపారు. అయితే, సీనియర్ నేత యడ్యూరప్ప రాజీనామా తరువాత ఆ రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలామంది ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. అనేక పేర్లు బీజీపీ అధిష్టానం ముందుకు […]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించ వద్దని కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇప్పటికే కార్మికులు ప్రకటించారు. ఇందులో భాగంగానే విశాఖలో ర్యాలీలు, నిరసన దీక్షలు చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే రాజ్యసభలో ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈరోజు కూడా పార్లమెంట్‌లో మరోసారి స్పష్టంగా […]