మగువులకు గుడ్ న్యూస్. ఆదివారం తరువాత ప్రతీ సోమవారం రోజున బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ, ఈరోజు ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,700 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,770 వద్ద ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉంటే, వెండి మాత్రం తగ్గింది. కిలో వెండి ధర రూ.300 తగ్గి రూ.72,000కి చేరింది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ధరలు అమాంతం పెరిగాయి. ఎప్పుడైతే నిబంధనలను సడలించారో అప్పటి నుంచి పుత్తడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
Read: ఏఆర్ రెహ్మాన్‌కి హైకోర్టులో ఊరట.. పిటిషన్ కొట్టివేత