కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అనివార్యమని తేలిపోయింది. ఈ విషయాన్ని యడ్డియూరప్ప స్వయంగా ప్రకటించారు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని పదవుల నుంచి తప్పించే సంప్రదాయం ఉన్నది. ఈ సంప్రదాయాన్ని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు గౌరవిస్తూ వస్తున్నారు. తన విషయంలో కూడా ఇదే విధమైన సంప్రదాయం ఉంటుందని, అందులో ఎలాంటి మార్పు లేదని యడ్డియూరప్ప విధానసభలో పేర్కొన్నారు. ఈనెల 26 వ తేదీకి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుంది. రెండేళ్ల సంబరాల తరువాత […]
కరోనా కాలంలో మాస్క్‌ల వాడకం అధికమయింది. కరోనా తరువాత ప్రపంచంలో వాడిపాడేసిన మాస్క్‌లతో కాలుష్యమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో టామ్ సిల్వర్ వుడ్ అనే డిజైనర్ డిస్పోజబుల్ మాస్క్‌లతో తెల్లని వెడ్డింగ్ గౌన్‌ను తయారు చేశారు. 1500 వాడి పడేసిన మాస్క్‌లతో ఈ వెడ్డింగ్ గౌన్‌ను తయారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ గౌన్ తయారీకి ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహాయం అందించింది. జెమియా హాంబ్రో అనే మోడల్ ఈ డ్రెస్‌ను […]
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ కలకలం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున అక్నూర్ సెక్టార్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ కనిపించడంతో ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపి డ్రోన్‌ను కూల్చివేశారు. ఈ డ్రోన్‌కు 5 కేజీల ఐఈడీ బాంబు అమర్చి ఉండటంతో వెంటన్ ఆర్మీ అధికారులు ఆ డ్రోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పెద్ద విధ్వంసం జరిగి ఉండేదని, ఈ డ్రోన్ కుట్ర వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద హస్తం ఉండి ఉంటుందని ఆర్మీ […]
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు పోటేత్తింది. ఒకవైపు ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద, మరోవైపు భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద నీటితో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మరికొన్ని రోజులు వర్షాలు […]
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 35,342 కేసులు…482 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,93,062కి చేరింది. ఇందులో 3,04,68,079 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,05,513 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,19,470 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి 38,740 మంది […]
పార్లమెంట్‌లో దేశంలోని సమస్యల గురించి నేతలు సీరియస్‌గా చర్చ చేస్తున్నారు. చర్చిస్తున్న సమస్యలపై స్పీకర్ మాట్లడుతున్న సమయంలో అనుకోకుండా ఓ అతిధి సభలోకి ప్రవేశంచింది. దానిని చూసి స్పీకర్ షాక్ కావడమే కాకుండా గట్టిగా నోటిని మూసేకున్నారు. అంతలో సభలో కలకలం రేగింది. నేతులు అటూ ఇటూ పరుగులు తీశారు. వీరిని అంతలా పరుగులు పెట్టించిన అతిధి ఎదో కాదు… చిన్న ఎలుక. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. పార్లమెంట్ భవనంలోకి వచ్చేసింది. […]
మనుషులను కంట్రోల్ చేయడం కంటే జంతువులను కంట్రోల్ చేయడం చాలా సులభం. సర్కస్‌లో జంతువులకు నెలల తరబడి ట్రైనింగ్ ఇస్తారు. అలా ట్రైనింగ్ ఇచ్చి వాటిని తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. సర్కస్ రింగ్‌లో అవి చెప్పినట్టుగా చేస్తుంటాయి. అయితే, రోడ్డుపై యాచిస్తూ జీవనం సాగించే ఓ వ్యక్తి నాలుగు ఎలుకలకు ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో తెలియదుగాని, అవి అతను చెప్పిన విధంగా వింటున్నాయి. ఎటు విసిరేసినా, వేలు చూపించిన తరువాత ఎటు చూపిస్తే అటు వచ్చి కూర్చుంటున్నాయి. […]
కరోనా మహమ్మారి నుంచి భూప్రపంచం ఎప్పటికి బయటపడుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. మరో మూడు నాలుగేళ్లపాటు కరోనా నుంచి ఇబ్బందులు తప్పేలా కనిపించడంలేదు. కేసులు పెరిగినపుడు లాక్‌డౌన్ చేసుకుంటూ కంట్రోల్ అయినపుడు తెరుస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే భారత్ పొరుగునున్న బంగ్లాదేశ్‌లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆక్కడ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది ఆ దేశం. జులై 23 నుంచి రెండు వారాల పాటు అంటే ఆగస్టు 5 వరకు […]
మేషం : శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉమ్మడి వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు, ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. అధికారులకు ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికం. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృషభం : కుటుంబీకుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సమాచారం లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశాన్ని జారవిడుచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయ రంగాలలో వారికి […]
ప్రపంచంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉన్నది. తగ్గినట్టే తగ్గి అనేక దేశాల్లో కరోనా తిరిగి విజృభిస్తున్నది. కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన రష్యాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ను తయారు చేసినప్పటికీ ఆ దేశంలో వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతున్నది. ఇప్పటికే ఆ దేశంలో నాలుగు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రష్యాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో పాటుగా ఇప్పుడు ఆ రష్యాలో గామా వేరింట్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. […]