భూమికి ప్రత్యామ్నాయ గ్రహం కోసం నాసా అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నది. చంద్రునిపై మనిషి నివశించేందుకు అనువుగా ఉన్నదా లేదా అనే దానిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా, అటు గురుగ్రహంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే నాసా రోవర్ గురుగ్రహంపై పరిశోధనలు చేస్తున్నది. గురు గ్రహంతో పాటుగా ఆ గ్రహానికి చెందిన చందమామ గానీమీడ్ పై కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ కొంత సమాచారాన్ని సేకరించి […]
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమపై రాళ్లదాడి జరిగింది. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ పనులను పరిశీలించి వస్తున్న సమయంలో జి కొండూరు మండలం, గడ్డమణుగ వద్ద దేవినేని ఉమ వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో దేవినేని ఉమ కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. దేవినేని ఉమ కారుపై దాడికి పాల్పడ్డారని […]
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటికే 45 కోట్లకు పైగా టీకాలు వేసినట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, గత కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ మందకోడిగా జరుగుతున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆరోగ్యశాఖ కొట్టిపారేసింది. గతంలో చెప్పిన విధంగానే జులై 31 నాటికి ఎట్టిపరిస్థితుల్లో కూడా 51 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేస్తామని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 45.7 కోట్ల డోసులు […]
కరోనా నుంచి బయట పడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే అనేక వ్యాక్సిన్లను అందుబాటులోకి వచ్చాయి. చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్నారు. ఇండియాలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో కేసులు, మరణాలు ఏవిధంగా ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఇండియాలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ను […]
కేసీఆర్ కుటుంబంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రమంతా అప్పుల పాలు అయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని షర్మిల విమర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా ఏకంగా 4 రెట్లు నిరుద్యోగం పెరిగిందని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. దళితులకు రూ.10 లక్షలు కాదు, రూ.50 లక్షలు ఇవ్వాలని […]
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,23,166 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 645 మందికి పాజిటివ్‌గా తెలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6,42,436 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,29,408 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,237 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 4 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మృతి […]
కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా తరువాత కొత్త సీఎం ఎవరు అనే దానిపై నిన్నటి నుంచి కసరత్తులు జరుగుతున్నాయి. నిన్నటి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్లమెంట్ ఆవరణలో భేటీ ఆయ్యి చర్చించారు. అధిష్టానం ముందుకు వచ్చిన పేర్లను పరిశీలించారు. అనంతరం సీఎం అభ్యర్థి ఎవరు అని నిర్ణయించే బాధ్యతను కేంద్ర మంత్రులైన ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డిలకు అప్పగించింది కేంద్రం. కాసేపట్లో ఈ ఇద్దరి కేంద్ర మంత్రుల […]
బెంగాల్ సీఎంగా మూడోసారి ఎంపికయ్యాక మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటకు వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోడితో సహా అనేక మంది నేతలతో దీదీ భేటీ కాబోతున్నారు. కొద్ది సేపటి క్రితమే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన వరద సాయం, వ్యాక్సిన్ డోసులు, రాష్ట్రం పేరు మార్పు తదితర విషయాలపై ఆమె ప్రధానితో చర్చించారు. ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పేవేర్ అంశం కుదిపేస్తున్నది. దీనిపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో చర్చ […]
2018 వరకు అంతంత మాత్రంగానే ఉన్న ఉభయ కొరియాల మధ్య సంబంధాలు, ఆ తరువాత కాస్త మెరుగుపడ్డాయి. ఇరు దేశాల అధినేతలు మూడుసార్లు భేటీ అయ్యారు. సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ఉభయ కొరియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెప్పడంతో వియాత్నం వేదికగా ఉత్తర కొరియా, అమెరికా దేశాధినేతల సమావేశం జరిగింది. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో దాని ప్రభావం ఉభయ కొరియాల మధ్య సంబంధాలపై […]