2018 వరకు అంతంత మాత్రంగానే ఉన్న ఉభయ కొరియాల మధ్య సంబంధాలు, ఆ తరువాత కాస్త మెరుగుపడ్డాయి. ఇరు దేశాల అధినేతలు మూడుసార్లు భేటీ అయ్యారు. సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ఉభయ కొరియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెప్పడంతో వియాత్నం వేదికగా ఉత్తర కొరియా, అమెరికా దేశాధినేతల సమావేశం జరిగింది. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో దాని ప్రభావం ఉభయ కొరియాల మధ్య సంబంధాలపై పడింది. 2019లో రెండు దేశాల మధ్య నువ్వా నేనా అనేలా మారిపోయాయి.
Read: ‘బిలీవ్’తో జట్టు కట్టిన ‘ఎస్.పి మ్యూజిక్’
రెండు దేశాల మధ్య ఏర్పాటు చేసిన ఇంటర్ కొరియన్ బోర్డర్ ఆఫీస్ ను కూడా అప్పట్లో కూల్చివేశారు. ఆ తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా దిగజారాయి. అయితే, ఇప్పుడు మళ్లీ ఉభయ కొరియాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హాట్‌లైన్‌ను పురరుద్ధరించారు. ఈ హాట్‌లైన్ ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. రెండు దేశాల అధినేతలు హాట్‌లైన్ ద్వారా సంభాషణలు చేసినట్టు సమాచారం. భవిష్యత్తులో రోజువారి సంభాషణలు జరిగే అవకాశం ఉందని, తిరిగి ఉభయ కొరియా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కొరియా అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే, ఉత్తర కొరియా మాత్రం నియంతృత్వ పోకడల కారణంగా పేదరికంలో మగ్గుతున్నది.