2019 నవంబర్ నుంచి చైనాలో కరోనా కేసులు బయటపడటం మొదలుపెట్టాయి. డిసెంబర్ నుంచి కేసులు పెరగడం మొదలుపెట్టాయి. చైనా నుంచి కేసులు ఇతర దేశాలకు వ్యాపించడం మొదలయ్యాయి. ఆ తరువాత ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తూ వచ్చారు. గత రెండేళ్లుగా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా కరోనా ఏ మాత్రం తగ్గడంలేదు. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ రూపాంతరాలు చెందుతూ బలం పెంచుకొని మరోమారు విజృంభిస్తున్నది. ప్రపంచంలోని దాదాపుగా 130 దేశాల్లో […]
పాకిస్తాన్‌లో మతమార్పిడులు సహజం. అక్కడ ఇతర మతస్థులను ఇస్లామ్ మతంలోకి బలవంతంగా మారుస్తుంటారు. అయితే, హిందువులు అధికంగా ఉన్న భారత దేశంలో కూడా మతమార్పిడిలు జరుగుతున్నాయి. దీనికోసం ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి జాబితాలో మీరట్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ పేరు మతం మార్పిడి చేసుకుంటున్న వారి లిస్ట్‌లోకి వెళ్లడంతో ఏటీఎస్ పోలీసులు అతడిని విచారణ జరిపారు. ఎటీఎస్ […]
ఈనెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచంలోని దాదాపు 200 దేశాల నుంచి వేలాదిమంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ట్యోక్యో చేరుకున్నారు. ప్రస్తుతం ఆరు రోజులుగా క్రీడలు జరుగుతున్నాయి. క్రీడలు ప్రారంభానికి ముందే ఆ దేశంలో కరోనా కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. ఇక రాజధాని టోక్యోలో కేసులు క్రమంగా పెరిగే అవకాశం ఉందని క్రీడలు ప్రారంభానికి ముందే నిపుణులు హెచ్చరించారు. కాగా, రోజు రోజుకు నగరంలో కేసులు […]
ఉగ్రవాదులకు అండగా ఉండే పాక్, వారిపై సానుభూతిని ప్రదర్శించడం సహజమే. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలీబన్‌లతో కలిసి పనిచేసేందుకు పాక్ ఇప్పటికే పదివేల మందికి పైగా ముష్కరులను ఆ దేశం పంపినట్టు ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో 70 శాతానికి పైగా భూభాగాన్ని ఆక్రమించుకున్నామని ఇప్పటికే తాలిబన్లు చెప్తూ వస్తున్నాయి. చిన్నారులను, మహిళలను హింసిస్తున్నారు. వేలాది మంది అమాయక ప్రజలను తాలిబన్లు పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారిపై పాక్ ఉదారతను ప్రదర్శిస్తున్నది. తాలిబన్లు మిలటరీ […]
భూమిపై ఎన్నో వింతు విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. వింతలూ, విశేషాలు కామన్. అయితే, కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఔరా అనిపించే విధంగా ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఇలాంటి వింతైన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా హరియావా గ్రామంలోని శారదానది ఉన్నట్టుండి గుడ్లనదిలా మారిపోయింది. వేలాది గుడ్లు నదిలో తేలాడుతూ కనిపించాయి. దీంతో హరియావా గ్రామస్తులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా నదిలో […]
శ్రీలంకలో భారత, లంక జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి టీ20లో ఇండియా జట్టు విజయం సాధించింది. ఎలాగైనా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సమం చేయాలని లంక జట్టు చూస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా జట్టును కట్టడి చేయడంలో లంక బౌలర్లు సఫలం అయ్యారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టేందుకు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు పడ్డారు. ఇండియా టీమ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేయగా, రుతురాజ్ […]
కేంద్ర జలశక్తిశాఖ ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. రూ.47,725 కోట్ల రూపాయలకు పోలవరం ప్రాజెక్టు అంచనాలను సవరించారు. ఈ అంచనాలను అంగీకరిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలను రేపు ఆర్ధిక శాఖలకు పంపించనున్నారు. పోలవరం సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలు పై వచ్చేవారం కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నది. పోలవరం ప్రాజెక్టును ఈ […]
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కుప్పకూలిన, ఆర్ధిక మోసాలకు గురైన బ్యాంకు డిపాజిటర్లకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ చట్టంలో సవరణలను క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్లకు వారి మొత్తం డిపాజిట్లపై రూ. 5 లక్షల భీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభావిత బ్యాంక్ తాత్కాలిక నిషేదానికి గురైన 90 రోజుల్లో ఈ భీమా లభిస్తుంది. దివాలా తీసిన బ్యాంకులపై ఆర్బీఐ తాత్కాలిక నిషేదం విధించిన తరువాత […]