కర్నాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ఖరారయ్యారు. కొద్ది సేపటి క్రితమే బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బసవరాజు బొమ్మైను ఖరారు చేస్తు నిర్ణయం తీసుకున్నారు. 2008లో జనతాదళ్ నుంచి ఆయన బీజేపీలో చేరారు. 1998, 2004లో ఎమ్మెల్సీగా పనిచేశారు. షిగ్గావ్ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. యడ్యూరప్ప ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన తరువాత ముఖ్యమంత్రి యడ్యూరప్ప తప్పుకోవడంతో ఆ స్థానంలో బసవరాజు బొమ్మైను నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకున్నది. బసవరాజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేబినెట్‌లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన బసవరాజు పారిశ్రామిక వేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిన నేతగా ఆయనకు కర్నాటకలో గుర్తింపు ఉన్నది.
Read: తైమూర్ ‘భారం’ తాను మోయలేనంటోన్న సైఫ్!