మేషం : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనం విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. రుణములు సన్నిహితుల సహాయంతో పూర్తిచేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్నిసందర్శిస్తారు. వృషభం : మత్స్యు, కోళ్లె, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. పెరిగిన ధరలు చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. హోటల్, […]
ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో తెలియదు. పాశ్ఛాత్య దేశాల్లో విడిపోవడం, విడాకులు తీసుకోవడం కామన్ అయింది. కొన్ని దేశాల్లో విడాకులు తీసుకోవడం కొంత కష్టమైన అంశం కావొచ్చు. అయితే, ప్రపంచంలో విడాకుల చట్టం లేని దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో విడాకులు తీసుకోవడం అస్సలు కుదరని పని. ఎందుకంటే ఆ దేశ చట్టాల్లో విడాకుల చట్టం లేదు. ప్రజలు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండేందుకే ప్రయత్నిస్తారు తప్పించి విడిపోవాలని […]
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు డిమాండ్ పెరుగుతున్నది. ముందుగా రూ.499 తో బుకింగ్ చేసుకోవాలి. 75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటీని విడుదల చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో రివర్స్ మోడ్ సౌకర్యాన్ని కల్పించారు. ఇది చాలా తక్కువ ద్విచక్రవాహనాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. హోండా గోల్డ్ వింగ్, బజాజ్ చేతక్, ఏథర్ 450, టీవీఎస్ ఐ క్యూబ్ వంటి వాహనాల్లో […]
అది 149 ఏళ్లనాటి భవంతి. పురాతన కాలం నాటి ఇల్లు కావడంతో చాలామందికి వాటిపై ఆసక్తి ఉంటుంది. ఎలాగైన చేజిక్కించుకోవాలని అనుకుంటారు. ఇక, పాత ఇల్లు తక్కువ ధరకు వస్తుంది అంతే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అందరిలాగే ఆ దంపతులు కూడా పాత ఇంటిని కోనుగోలు చేశారు. కొంతకాలం హ్యాపీగానే గడిచినంది. ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఇంటి గోడల్లో నుంచి పెద్ద పెద్ద శబ్దలు వినిపించాయి. దాంతో ఆ దంపతులు భయపడిపోయారు. […]
భారత్‌లో రోజువారీ కరోనా కేసులు 40 వేల వరకు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా 500 లకు పైగానే నమోదవుతున్నది. సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ కేసులు అధికంగా ఉండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. పలు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 దాటినట్టు గణాంకాలు అందటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉండగా ఆర్ ఫ్యాక్టర్ 1.4కి చేరింది. కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత ఇది 0.7కి చేరింది. అయితే, ఇప్పుడు […]
కరోనా సమయంలో యాచకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా లాక్ డౌన్ కారణంగా తిండిలేక నరకయాతనలు అనుభవించారు. ప్రభుత్వాలు వీరికోసం ప్రత్యేకంగా షల్టర్‌లు ఏర్పాటు చేసి కొంతమేర ఆదుకుంది. అయితే, రాజస్థాన్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని అవయవాలు సరిగా పనిచేస్తున్నప్పటికి విధి కారణంగా యాచక వృత్తిని స్వీకరిస్తుంటారు. ఇలాంటి వారికి గుర్తించి వారికి వొకేషనల్ లైఫ్ విట్ డిగ్నిటీ పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఏడాదికాలంపాటు శిక్షణ ఇస్తోంది. […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ 50 లక్షలకు పైగా టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టీకారు రెండు డోసుల టీకాలు. రెండు డోసులు తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదిలా ఉంటే, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ […]