కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ 50 లక్షలకు పైగా టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న టీకారు రెండు డోసుల టీకాలు. రెండు డోసులు తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదిలా ఉంటే, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతుండటం, మూడో వేవ్ ముప్పు ప్రమాదం పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరిన్ని వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కేంద్రం ప్రయత్నం చేస్తున్నది.