విశ్వ క్రీడలు జపాన్ రాజధాని టోక్యోనగరంలో విజయవంతంగా ముగిశాయి. ఒకవైపు కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దానిని ఎదుర్కొంటూ క్రీడలను నిర్వహించారు. రాజధాని టోక్యోలో వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. వాటి ప్రభావం క్రీడానగరంపై పడిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ క్రీడాకారులు కరోనా బారిన పడుతూనే ఉన్నప్పటికీ పట్టుదలతో క్రీడలను పూర్తిచేశారు. ఒలింపిక్ క్రీడలు అంటే హడావుడి ఏ విధంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. క్రీడాకారులు, ప్రేక్షకులతో స్టేడియాలు కక్కిరిసిపోయి ఉంటాయి. కానీ, దానికి విరుద్దంగా క్రీడలు […]
మేషం: ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వృషభం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. స్త్రీలకు నరాలు, వెన్నుముక దంతాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. […]
దేశంలో అధికంగా అమ్ముడుపోయే వాటిల్లో బంగారం కూడా ఒకటి. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయాల్సిందే. గత కొంత కాలంగా పుత్తడి ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడ్డారు. అయితే, తాజాగా మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 760 తగ్గి 43,840కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 830 […]
భారత సైనికుల చేతికి కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక అయుధాలు అందించింది. చైనా సరిహద్ధుల వెంబడి పహారా కాస్తున్న సైనికులకు అమెరికన్ సిగ్ సావర్ 716, అసాల్ట్ రైఫిల్స్, స్విస్ ఎంపీ 9 గన్స్‌ను సైన్యానికి అందించింది ప్రభుత్వం. లఢఖ్‌లోని న్యోమా వద్ద పహారా కాస్తున్న బలగాలకు ఈ ఆయుధాలను అందించింది. ఈ ప్రాంతంలో నిత్యం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుంటాయి. చలికాలంలో మైనస్ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. సైనికుల రక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎరెక్టబుల్ […]
దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. తీవ్రత పెరుగుతుండటంతో ఒకే వ్యాక్సిన్ రెండు డోసుల కంటే మిశ్రమ వ్యాక్సిన్ విధానం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే అంశంపై ఐసీఎంఆర్ పరిశోధన నిర్వహించింది. ఒక డోసు కోవీషీల్డ్, మరో డోసు కోవాగ్జిన్ టీకాలు పొందిన వారికి, రెండు డోసులూ ఒకే రకం వ్యాక్సిన్ తీసుకున్న వారికన్నా మెరుగైన రోగనిరోధక రక్షణ లభిస్తోందని తేలింది. ఉత్తర […]
ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. కేసులు భారీ స్థాయిలో పెరగడానికి, తీవ్రత పెరగడానికి ఆ డెల్టా వేరియంట్ ప్రధాన కారణం. అమెరికాలో సైతం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇండియా పొరుగుదేశం శ్రీలంకలోనూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు అధికమవ్వడంతో ఆ దేశం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇంటివద్దనే ఉండాలని, సాద్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని కోరింది. డెల్టా వేరియంట్ కారణంగా ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగినట్టు […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధంగా మారింది. ప్రపంచంలో ఇప్పటికే పలురకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ కొరత లేకున్నా, టీకాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అనేక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు వివిధ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతున్నది. అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి, తిరిగి పెరుగుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని […]
అమరావతి ఉద్యమం ప్రారంభమయ్యి 600 రోజులు పూర్తైన సందర్బంగా న్యాయస్తానం టు దేవస్థానంకు ఉద్యమకారులు పిలుపునిచ్చారు. దీంతో రైతులు, మహిళలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఉద్యమకారులను అడ్డుకున్నారు. దీంతో రైతులు, మహిళలు రోడ్లపై భైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతు మహిళలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు మహిళా ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని మందడం, వెంకటపాలెంలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. […]