అది 149 ఏళ్లనాటి భవంతి. పురాతన కాలం నాటి ఇల్లు కావడంతో చాలామందికి వాటిపై ఆసక్తి ఉంటుంది. ఎలాగైన చేజిక్కించుకోవాలని అనుకుంటారు. ఇక, పాత ఇల్లు తక్కువ ధరకు వస్తుంది అంతే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అందరిలాగే ఆ దంపతులు కూడా పాత ఇంటిని కోనుగోలు చేశారు. కొంతకాలం హ్యాపీగానే గడిచినంది. ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఇంటి గోడల్లో నుంచి పెద్ద పెద్ద శబ్దలు వినిపించాయి. దాంతో ఆ దంపతులు భయపడిపోయారు. తెల్లారిన వెంటనే స్థానిక పరిశోధనా కేంద్రానికి కాల్ చేశారు. వెంటనే వచ్చి వారు ఆ ఇంటి గోడను బద్దలు కొట్టారు. గోడ పగలగొట్టిన వెంటనే అందులోనుంచి పెద్ద సంఖ్యలో తేనేటీగలు బయటకు వచ్చేశాయి. ఆ గోడ లోపల దాదాపుగా 4 లక్షలకు పైగా తేనెటీగలు ఉన్నాయని తెలియడంతో దంపతులు షాక్ అయ్యారు. ఇంటి ఓనర్ ఈ విషయం చెప్పకుండా తమకు ఇంటిని తక్కువ ధరకు అమ్మేశారని లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది.
Read: ‘షేరో’ పూర్తి చేసిన సన్నీ