1920 నుంచి భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన వారిలో గాంధీ మహాత్ముడు ముందువరసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అహింసా మార్గంలో ఆయన పోరాటం చేశారు. సత్యాగ్రహ దీక్షతో ఆకట్టుకున్నారు. దండి మార్చ్, విదేశీ దుస్తుల బహిష్కరణ వంటి కీలక పోరాటాలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక ఇండియాలో స్వాంతంత్ర పోరాటం మరింత ఉధృతం అయింతి. ఇండియాకు స్వాతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ బ్రిటీష్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటుగా, […]
గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7:15 గంటల నుంచి 8:20 గంటల మధ్యలో మూడుసార్లు భూమి కంపించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 2.3,2.7,3 గా నమోదయింది. పులిచింతలతో పాటుగా తెలంగాణలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ, సూర్యపేటలోనూ స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోపల పొరల్లో వస్తున్న మార్పుల కారణంగా భూప్రకంపనలు కలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్
కొన్ని వస్తువులు ఉన్నట్టుండి కదులుతుంటాయి. అవి ఎందుకు అలా కదులుతాయో తెలియదుగాని అలాంటి విషయాలు మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఆ విషయాల గురించి నెటిజన్లు కామెంట్లు, షేర్లు చేస్తుంటారు. కొంతమంది వాటికి అద్భుత శక్తులు ఉన్నాయని చెబితే, మరికొందరు మాత్రం వాటిని దెయ్యాలుగా చెబుతుంటారు. ఇలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అది నాగపూర్‌లోని శతాబ్దినగర్ ప్రాంతం. రాజేంద్ర అనే ఆటో డ్రైవర్ తన ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో వింతఆకారానికి […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధానిగా ఉండాలని అమరావతి ఉద్యమానికి ప్రజలు నడుం బిగించి నేటికి 600 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా రాజధానిలోని హైకోర్టు నుంచి మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వరకు ర్యాలీని నిర్వహించాలని అమరావతి ప్రాంత రైతులు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి […]
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 60 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల్లో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. మొదట ఈ వేడుకలకు 500 మందికి పైగా అతిధులను పిలవాలని అనుకున్నా, కరోనా ఉధృతి కారణంగా ఆ సంఖ్యను తగ్గించారు. ఈ వేడుకలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎందుకంటే, ఈ వేడుకలకు హాజరైన వారిలో చాలామంది మాస్క్ పెట్టుకోలేదని, ప్రస్తుతం అమెరికాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయని, సెలబ్రిటీలు మాస్క్ పెట్టుకోకుండా […]
ఇండియాలో కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇండియాలో 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి చేరింది. ఇందులో 3,10,99,771 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,06,822 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. దేశంలో కొత్తగా కరోనాతో 491 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4,27,862కి చేరింది. ఇకపోతే, […]
బెంగాల్‌లో మూడోసారి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీకి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోతున్నది. దేశంలోని అన్ని అన్నిరాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనే అలోచనలో దీదీ ఉన్నట్టు సమాచారం. దానికి ఇదే సాక్ష్యం అని చెప్పొచ్చు. కేరళలో దీదీని పిలవండి… దేశాన్ని కాపాడండి…ఛలో ఢిల్లి… పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేరళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఈ పోస్టర్లు వెలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 34 ఏళ్లు ఏకచక్రాధిపత్యంగా బెంగాల్‌ను శాశించిన వామపక్షాల కోటను బద్దలుకొట్టి 2011లో దీదీ అధికారంలోకి వచ్చింది. […]
ఎలన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మరో అంకానికి తెరతీసింది. అంగారక గ్రహం మీదకు ప్రయాణికులను పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. స్టార్ షిప్ పేరుతో ఓ భారీ వ్యోమనౌకను తయారు చేస్తున్నది. ఇందులో 100 మంది వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్టార్ షిప్‌ను రీయూజబుల్ మోడల్‌లో తయారు చేస్తున్నారు. 120 మీటర్ల పొడవున్న ఈ స్టార్ షిప్‌లో ఆరు రాప్టర్ ఇంజన్లు ఉంటాయి. ఇక […]
ఆఫ్ఘనిస్తాన్‌లో రోజురోజుకు తాలీబన్ ఉగ్రవాదుల దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు అక్కడి సామాన్య ప్రజలకు నరకం చూపిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ దళాలకు, తాలీబన్‌లకు మధ్య పోరు జరుగుతున్నది. ఆఫ్ఘన్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని, అక్కడ ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని, ఒకవేళ టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకుంటే రుణాలు అందిస్తామని […]