ప్రతి ఏడాది దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా నిర్వహించడం వలన అధికవ్యయం అవుతున్నది. అంతేకాకుండా అభివృద్ది సైతం కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఒకేసారి ఖర్చు చేస్తే సరిపోతుంది. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం నిధులు కేటాయిస్తే, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఆయా రాష్ట్రాలు నిధులు సమకూర్చుకోవాలి. అదే అన్ని ఎన్నికలు […]
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు 30 వేల వరకు నమోదవుతుండగా, గత రెండు రోజుల నుంచి మళ్లీ పెరగడం ప్రారంభించాయి. దేశంలో కొత్తగా 42,982 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,12,114కి చేరింది. ఇందులో 3,09,74,748 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,11,076 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 […]
పాక్‌లో మరో హిందూ ఆలయంపై దాడులు జరిగాయి. పాక్‌లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భాంగ్ నగరంలోని సిద్ధి వినాయక దేవాలయంపై కొంతమంది అల్లరిమూక దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో అలయం పూర్తిగా ధ్వంసం అయింది. పాక్‌లో హిందువులు, సిక్కులు మైనర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. మైనర్లపై అక్కడ తరచుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రసిద్ది చెందిన ఎన్నో దేవాలయాలను అక్కడి మెజారిటీలు ధ్వంసం చేశారు. సిద్ధివినాయక దేవాలయంపై బుధవారం రోజున కొంతమంది మూక […]
ఎలాగైనా స్వర్ణం గెలవాలని టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఒటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు కాంస్యపతకం పోరులో భారత జట్టు జర్మనీతో తలపడింది. నాలుగు క్వార్టర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది. రెండు క్వార్టర్‌లు ముగిసే సరికి 3-3 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది. […]
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు ఆశలు రేపుతున్నారు. 53 కేజీల మహిళా విభాగంలో ఇండియా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేశారు. స్వీడన్‌కు చెందిన మ్యాట్‌సన్‌ను 7-1 తేడాతో ఓడించారు. ఈ మ్యాచ్‌లో ఆదినుంచి ఫొగాట్ ఆదిపత్యం సాధించింది. వీలైనంత వరకూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని మట్టికరిపించింది. మొదటి పిరియడ్‌లో 2,2,1 స్కోర్ సాధించిన ఫొగాట్, రెండో పీరియడ్‌లో 2 స్కోర్ మాత్రమే చేసింది. అయితే, స్వీడన్ క్రీడాకారిణి ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయంట్ […]
దశాబ్దాల తరబడి వివాదాస్పదంగా ఉన్న ఆయోద్య రామాలయ నిర్మాణం పనులు ఎట్టకేలకు వేగంగా సాగుతున్నాయి. 2019లో ఆయోద్య రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో రామాలయ నిర్మాణం పనులు చేపట్టడానికి మార్గం సుగుమం అయింది. ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతున్నది. అయితే, రామాలయ నిర్మాణాన్ని 2023 చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. 2023 చివరి వరకు గర్భగుడి నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించింది. దానికి తగ్గట్టుగానే నిర్మాణం […]
పులిచింతల వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండింది. దీంతో నీరును గేట్టు ఎత్తి దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం చేసే సమయంలో ప్రాజెక్టులోని 16 వ నెంబర్ గేటు విరిగిపోయింది. దీంతో ఎమర్జెన్సీ గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు రాకపోకలను నిలిపివేశారు. పులిచింతల నుంచి ప్రస్తుతం […]
దేశంలో ఎక్కువగా వినియోగించే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి. కరోనా కాలంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. అయితే, ఇప్పుడు మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుంటుండటంతో పెరిగిన ధరలు దిగివస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,940 వద్ద స్థిరంగా ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ […]