చోరుల్లో పలు రకాలు ఉంటారు. కొంతమంది ఇళ్లకు కన్నాలు వేస్తే మరికొందరు బ్యాంకులకు కన్నం వేస్తారు. అయితే కొందరు మాత్రం ఏకంగా ఏటీఎం లకు కన్నం వేస్తుంటారు. ఇలానే ఓ చోరుడు ఏటీఎంకు కన్నం వేశాడు. అయితే, ఏటీఎం మిషన్ బద్దలు కొట్టగానే అలారం మోగింది. దీంతో భయపడిన ఆ చోరుడు ఏటీయం మిషిన్‌లో దాక్కునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ, మిషిన్ లోపల స్థలం చిన్నదిగా ఉండటంతో బయటకు రాలేకపోయాడు. పదేపదే మిషన్ అలారం మోగడంతో పోలీసులు ఏటీఎం మిషన్ వద్దకు చేరుకొని ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని అనియాపురంలో జరిగింది. స్థానిక కోళ్లఫారంలో పనిచేస్తూ అవసరాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఈ బీహార్ చోరుడు.