గణేష్ చతుర్థి సందర్భంగా నగరంలో భారీ గణనాథులను ఏర్పాటుచేశారు. మూడో రోజు నుంచి గణపతుల నిమర్జన కార్యక్రమం జరగాల్సి ఉన్నది. ఈరోజున నిమర్జనం కావాల్సిన విగ్రహాలు కొన్ని ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. అయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు హైకోర్టు అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలుగుతుందని, హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే, హౌస్ మోషన్ పిటిషన్‌ను ఈరోజు విచారించేందుకు హైకోర్ట్ నిరాకరించింది. పిటిషన్‌ను రేపు విచారిస్తామని హైకోర్టు పేర్కొన్నది. దీంతో ట్యాంక్‌బండ్‌లో గణపతుల నిమర్జన కార్యక్రమం అయోమయంలో పడిపోయింది.
Read: వైరల్: ఆ ముసలాయన స్కైటింగ్ స్కిల్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే…