1950- 60 తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో ట్రెండీ కల్చర్ మొదలైంది. పాశ్చాత్య దుస్తులు ధరించడం అలవాటు చేసుకున్నారు. అయితే, 1996 నుంచి 2001 మధ్యలో తాలిబన్లు ఆక్రమణలతో తిరిగి బుర్ఖాలు ధరించాల్సి వచ్చింది. 2001 తరవాత తిరిగి ప్రజాస్వామ్య పాలనలోకి రావడంతో ప్రజలు స్వతంత్రంగా జీవించడం మొదలు పెట్టారు. తమకు నచ్చిన దుస్తులు వేసుకుంటున్నారు. కాగా, ఇప్పుడు మరోసారి సడెన్‌గా తాలిబన్ల పాలనలోకి ఆఫ్ఘన్ వెళ్లడంతో అక్కడి మహిళలు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా దుస్తుల విషయంలో ఆంక్షలు విధించవద్దని, […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 వ తేదీనుంచి ఆగస్టు 30 వ తేదీ వరకు అమెరికన్ ఆర్మీ కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నది. ఆగస్టు 31 నుంచి తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి కమర్షియల్ విమానాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాలేదు. కాగా, ఈరోజు ఉదయం పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి విమానం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఇందులో 10 మంది వరకు ప్రయాణికులు […]
కర్ణాటకలో రాజకీయాలో మరోసారి రచ్చ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే, కాంగ్రెస్ నుంచి పలువులు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సంకీర్ణప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిని రెండేళ్ల తరువాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పటెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ మారేందుకు బీజేపీ పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వజూపారని, కానీ తాను వాటిని […]
ఇంట్లో ఒంటరిగా రెండు మూడు రోజులు ఉండాలంటేనే భయపడిపోతాం. అలాంటిది అడవిలో ఎవరూ తోడు లేకుండా నివశించాలంటే ఇంకేమైనా ఉన్నదా? ఎటు నుంచి ఏ పాము వస్తుందో, కౄరమృగం వచ్చి చంపేస్తుందో అని భయపడిపోతుంటాం. కాని, ఆమె అలా భయపడలేదు. ఒకటి కాదు రెండు కాదు 70సంవత్సరాల నుంచి అడవిలో ఒంటరిగా నివశిస్తోంది. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండలంలోని పెదకాద అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలో ఓ అడవి ఉన్నది. ఆ అడవిలో […]
నిన్నటి రోజున దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు జరిగాయి. దేశంలోని 202 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 లక్షల మంది ఈ పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. […]
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్నిపార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. అమ్ములపొదిలోని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. యోగీ నేతృత్వంలోనే 2022 ఎన్నికలకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ పార్టీ కొత్త తరం నేతలతో దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్నది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయని ప్రియాంకా గాంధీ మొదటిసారి యూపి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమెను యూపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వం ఖరారైనట్టు […]
జమ్మూకాశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు భద్రతా బలగాలకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు వేగంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తాలిబన్ల నుంచి ఇతర దేశాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. తాలిబన్లను ఎదుర్కొనడానికి అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ తాలిబన్లు జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రచర్యలకు తెగబడితే దానిని ఎలా ఎదుర్కోవాలి, వారిని ఎలా తరిమికొట్టాని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి వంటి […]
ముస్కాన్ సేథీ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో బాలకృష్ట పైసా వసూల్ సినిమాలో నటించింది. అదే విధంగా రాగల 24 గంటల్లో సినిమాలో కూడా నటించి మెప్పించిన నటి ముస్కాన్ సేథి. తెలుగు సినిమాలతో పాటుగా అటు బాలివుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పిస్తోంది. బాలివుడ్ వెబ్ సీరిస్‌లలో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం మరోప్రస్థానం మూవీలో నటిస్తోంది. తనీష్ హీరోగా నటించిన ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించారు. ఇందులో వరుడు ఫేం భానుశ్రీ […]
తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నాక కాబూల్‌లోని ప్రెసిడెంట్ భవనంలో తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ప్రెసిడెండ్ భవనంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఖరీదైన తివాచీలపై కూర్చోని ఇష్టం వచ్చినవి వండించుకొని తింటున్నారు. దీనికి సంబందించిన దృశ్యాలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇదిలా ఉంటే, ప్రెసిడెంట్ భవనంతో పాటుగా ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తోమ్ ఇంటిని కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దోస్తోమ్ తాలిబన్లకు బద్ధశతృవు. పారాట్రాపర్‌గా, కమాండర్‌గా, దేశానికి ఉపాధ్యక్షుడిగా […]