హైదరాబాద్‌లో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన వందలాది గణపతి మండపాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమర్జనానికి అనుమతిని నిరాకరిస్తూ ఈ నోటీలుసు ఇచ్చిరు. హైకోర్టు ఆదేశాలతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై రేపు తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయనున్నది. ఒకవేళ రివ్యూపిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తే పరిస్థితి ఏంటి అన్నది చూడాల్సి ఉన్నది. ప్రతి ఏడాది వేలాది గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేస్తుంటారు. దీని వలన సాగర్ కలుషితం అవుతున్నది. ప్లాస్టర ఆఫ్ ప్యారిస్ లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. వీటి వలన వాతావరణం కాలుష్యం అవుతుందని హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.
Read: పారాలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని మోడీ భేటీ…