వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి విజయం సాధించాలని అధికార పార్టీ బీజేపీ చూస్తున్నది. అయితే, గత కొంతకాలంగా దేశంలో రైతులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. రాబోయో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా రైతులు ప్రచారం చేయాలని చూస్తున్నారు. వెంటనే రైతు చట్టాలను ఉపసంహరించుకోకుంటే రాష్ట్రాల్లో బీజేపి అధికారం కోల్పోక తప్పదని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు పెద్ద ఎత్తున […]
వాతారవణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఉత్తర దక్షిణ దృవాల వద్ధ ఉన్న మంచు భారీగా కరిగిపోతున్నది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో పాటుగా వాతారవణంలో వేడి కూడా పెరుగుతుండటంతో సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఒకవేళ వర్షాలు కురవడం మొదలుపెడితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక నగరీకరణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి ఉద్గార వామువులు విడుదలవుతున్నాయి. దీని వలన […]
గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజ్ కోట్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు పెద్ద చెరువులుగా మారిపోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ పోలీసులు వెనకడుగు వేయకుండా వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీనిని సంబందించిన వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. […]
కరోనా కాలంలో కొత్త కొత్త విషయాలను మనం తెలుసుకున్నాం. రెండేళ్లుగా చాలా మంది ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నాయి. పిల్లలైతే ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చదువుతున్నారు. కరోనా సమయంలో చాలా మంది ఖైదీలను ప్రభుత్వాలు విడుదల చేశాయి. అలా విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకుండా ఉంటారు అని గ్యారెంటీ లేదు. అందుకే కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వర్క్‌ఫ్రమ్ హోమ్ మాదిరిగానే జైల్ ఫ్రమ్ హోమ్ అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. దీనికి […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తాలిబన్ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు కూర్పు నచ్చకనే ఆ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ముల్లా బరాదర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ముల్లా మహమ్మద్ హసన్ ప్రధాని అయ్యారు. అదే విధంగా, ప్రభుత్వంలో హుక్కానీలకు పెద్దపీట వేస్తూ పదవులు అప్పగించారు. గతంలో దోహాలో జరిగిన సమావేశంలో తాలిబన్లు […]
ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఇప్పుడు తాలిబన్ల వశం అయింది. అక్కడ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, పూర్తిస్తాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచదేశాల గుర్తింపు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకుంటే ఆఫ్ఘన్ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేందుకు కొన్నిదేశాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలోని మాజీనేతల […]
ఆయుధాలను తయారు చేయడంలో, నూతన టెక్నాలజీని వినియోగించి రోబోలను తయారు చేయడంతో ఇజ్రాయిల్ ముందు వరసలో ఉన్నది. ఆ దేశం తయారు చేసిన రాడార్ వ్యవస్థలను ఎన్నో దేశాలు వినియోగించుకుంటున్నాయి. కాగా, ఇప్పుడు ఇజ్రాయిల్ మరో కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. సరిహద్దుల్లో భద్రత కోసం రోబోటిక్ వాహనాలను తయారు చేసింది. మనిషి అవసరం లేకుండా ఈ వాహానాలు సరిహద్దుల్లో పహారా కాస్తుంటాయి. ఈ రోబోటిక్ వాహనాల్లో రెండు మెషిన్ గన్లు, కెమేరాలు, సెన్సార్లు అమర్చుతారు. రెక్స్ […]
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 24 గంటలకు ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులకు వరాల జల్లులు కురిపించారు. పోలీసులు పనిచేస్తున్న జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వేలాది మంది పోలీసులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. దీంతో పాటుగా ఇప్పుడు అమలు చేస్తున్న రిస్క్ అలవెన్స్‌ను రూ.800 నుంచి రూ.1000 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు స్టేషన్లో పనిచేస్తున్నకానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు […]
చిన్న చిన్న దేశాల అవసరాలను తెలుసుకొని వాటికి సహాయం చేసి మెల్లిగా ఆ దేశంలో పాగా వేయడం డ్రాగన్ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. గతంతో బ్రిటీష్ పాలకులు చేసిన విధంగానే ఇప్పుడు డ్రాగన్ పాలకులు చేస్తున్నారు. పాక్‌కు కావాల్సనంత డబ్బులు ఇచ్చి ఆ దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది. ఇటు శ్రీలంకను సైతం అదేవిధంగా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది డ్రాగన్. కాగా ఇప్పుడు దృష్టిని కువైట్‌వైపు మళ్లించింది. కువైట్ ప్రస్తుతం అల్ షకయా ఎకనామిక్ సిటీని […]
బెంగాల్‌లోని భవానీ పూర్ నియోజకవర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉండగా, బీజేపీ నుంచి ప్రియాంక పోటీ చేస్తున్నారు. ఇక సీపీఐ నుంచి శ్రీజివ్ బిశ్వాస్ బరిలో ఉన్నారు. నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన మమతా బెనర్జీ తన సొంత నియోజక వర్గం భవానీపూర్ నుంచి బరిలో దిగారు. అమె విజయం నల్లేరుపై నడకే అని చెప్పొచ్చు. అయిన్పటికి బీజేపీ […]