వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి విజయం సాధించాలని అధికార పార్టీ బీజేపీ చూస్తున్నది. అయితే, గత కొంతకాలంగా దేశంలో రైతులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. రాబోయో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా రైతులు ప్రచారం చేయాలని చూస్తున్నారు. వెంటనే రైతు చట్టాలను ఉపసంహరించుకోకుంటే రాష్ట్రాల్లో బీజేపి అధికారం కోల్పోక తప్పదని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి. ఇటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రైతులు కూడా ఉద్యమం చేస్తున్నాయి. ఇందులో జాట్ వర్గానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో వీరి ఆగ్రహాన్ని కొంతమేర తగ్గించేందుకు, వారిని ప్రసన్నం చేసుకునేందుకు వారి సామాజిక వర్గానికి చెందిన స్వాతంత్య్ర సమరయోథుడు, విద్యావేత్త, సామాజిక సంస్కర్త రాణా ప్రతాప్ సింగ్ పేరుతో లోధా, జరౌలీ గ్రామాల్లోని 92 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. హడావుడిగా సర్కార్ ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం వెనుక ఎన్నికలే కారణం అని, రైతులు బీజేపీ మాయలో పడిపోరని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Read: 2050 నాటికి 200 మిలియన్ల మందిపై ఆ ప్రభావం…!!