తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 24 గంటలకు ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులకు వరాల జల్లులు కురిపించారు. పోలీసులు పనిచేస్తున్న జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వేలాది మంది పోలీసులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. దీంతో పాటుగా ఇప్పుడు అమలు చేస్తున్న రిస్క్ అలవెన్స్‌ను రూ.800 నుంచి రూ.1000 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు స్టేషన్లో పనిచేస్తున్నకానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు వారం రోజులపాటు అదనంగా సెలవులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై ఏటా ఉచితంగా పనిచేస్తున్న పోలీసులతో పాటుగా వారి భార్యలకు కూడా ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా చెన్నైలోని థౌజెండ్ లైట్స్ ప్రాంతంలో రూ.275 కోట్లతో పోలీస్ క్వార్టర్స్‌ను నిర్మించున్నట్టు స్టాలిన్ పేర్కొన్నారు.
Read: కువైట్‌పై డ్రాగన్ కన్ను…