ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చేవారంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లనున్నారు. క్వాడ్ దేశాల సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మోడి సెప్టెంబర్ 25 వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. రెండు రోజులపాటు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నట్టు పీఎంవో కార్యాలయం తెలియజేసింది. ఈనెల 24 వ తేదీన క్వాడ్ దేశాల సదస్సు జరగనున్నది. ఇండియా, అమెరికా, జపాన్, అస్ట్రేలియా దేశాలు క్వాడ్ […]
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే గేమ్ ఫుట్‌బాల్. యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఈ క్రీడలకు మంచి ప్రాచుర్యం ఉన్నది. మనదేశంలో కూడా ఈ గేమ్‌కు ఆదరణ ఉన్నా, దానికి తగిన మౌళిక సదుపాయాలు, శిక్షణ లేకపోవడంతో కొంత వెనకబడి ఉన్నది. అయితే, కొన్ని ప్రాంతాల్లో పిల్లలు గల్లీగ్లలీల్లో ఆ ఫుట్‌బాల్ గేమ్ ఆడుతుంటారు. ఒడిశాలోని సబరంగ్‌పూర్ జిల్లాలోని సుకీగావ్ అనే గ్రామంలో పిల్లలు ఫుట్‌బాల్ గేమ్ అడుతుండగా పక్కనే ఉన్న అడవిలోనుంచి రెండు ఎలుగు […]
ఖైరతాబాద్ గణపయ్యను దర్శించేందుకు వందలాది మంది భక్తులు నిత్యం వస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా 40 అడుగుల ఎత్తైన మహా గణపతిని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణపయ్యకు మొదటిసారి తలపాగను ఏర్పాటు చేశారు. తలపాగతో ఖైరతాబాద్ గణపయ్యకు కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. బాహుబలి సినిమాలు తలపాగలు తయారు చేసిన చార్మినార్‌కు చెందిన బృందం మహాగణపతికి తలపాగను తయారు చేశారు. 14 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉండే విధంగా మహాగణపతికి తలపాగను తయారుచేశారు. ఈ తలపాగతో […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 25,404 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579కి చేరింది. ఇందులో 3,24,84,159 మంది కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. 3,62,207 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 37,127 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌లో పేర్కొన్నది. 24 గంటల్లో కరోనాతో 339 మంది మృతి […]
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగం క్రమంగా పెరుగుతున్నది. కాగా, కొంతమంది సైకిల్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ స్ట్రైడర్ సైకిల్స్ అర్బన్ కమ్యూటర్స్ రెండు రకాల ఈ సైకిళ్లను విపణిలోకి తీసుకొచ్చింది. బ్యాటరీ ఆధారంగా ఈ సైకిళ్లు నడుస్తాయి. వోల్టాక్ 1.7, కాంటినో ఈటీబీ 100 మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సైకిళ్లకు సంబందించిన బ్యాటరీని […]
గత కొంతకాలంగా వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. ఉద్గార వాయువులు వాతావరణంలో కలిసిపోవడంతో కాలుష్యం ఏర్పడుతున్నది. గాలిలో ఆక్సీజన్ శాతం తగ్గిపోయి శ్వాససంబంధమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించాలి అంటే తప్పనిసరిగా చెట్లను పెంచాలని నిపుణులు పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలి ఎక్కడ లభిస్తుంది అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను విడుదుల చేసింది. ఈ ఇండెక్స్ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఉప్పల్‌లో స్వచ్ఛమైన గాలి లభిస్తుందని […]
ఎమ్మెల్యేలకు తమ ప్రాంతంలోని సమస్యలు చెప్పుకుంటూ ప్రజల నుంచి వినతి పత్రాలు వస్తుంటాయి. ఆ పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతేకు ఓ యువకుడి నుంచి విచిత్రమైన లేఖ వచ్చింది. చంద్రాపూర్ ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, కాని తనకు ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని, ఎంత ప్రయత్నించినా తనకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేరని, జులాయిగా తిరిగే వాళ్లకు, తాగుబోతులకు కూడా గర్ల్‌ఫ్రెండ్స్ […]
దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ప్రతి రోజూ 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. అయితే, థర్డ్ వేవ్ ముప్పుపొంచి ఉందన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యాక్సిన్‌ను వేగం చేయడంతో కరోనా కేసులు నమోదవుతున్నా మరణాల సంఖ్య, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. థర్డ్ వేవ్ ముప్పుపై బెనారస్ విశ్వవిద్యాలయం పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో కొన్ని విషయాలు వెలుగుచూశాయి. మూడో వేవ్ ముప్పు మరో మూడు […]
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేనలు పూర్తిగా తప్పుకున్నాయి. 2001 నుంచి 2021 వరకు దాదాపు 80 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్‌కు సమకూర్చింది. ఇందులో అధునాతనమైన 73 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. వీటితో పాటుగా అనేక ఆయుధాలు ఉన్నాయి. అమెరికా దళాలు బయటకు వచ్చే సమయంలో కొన్నింటని వెనక్కి తీసుకొచ్చారు. కొన్ని ఆయుధాలను అక్కడే వదిలేసి వచ్చారు. ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చిన వాటిపై అమెరికా అందోళన వ్యక్తం చేస్తున్నది. అమెరికా వదిలేసి వచ్చిన […]
మేషం : ఆర్థికంగా కొంతవరకు కుదుటపడతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగండి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వృషభం : ఉద్యోగస్తుల కనిష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మీయుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పరిస్థితులు అనుకూలించడంతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ […]