ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించిన తరువాత కౌంటింగ్ ను నిలిపివేయాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంజ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఈరోజు తీర్పును ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కోట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్ఈసీ కౌంటింగ్‌కు సంబందించిన తేదీని ప్రకటించాల్సి ఉన్నది. […]
సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ఘన్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావత్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును పట్టుకోవడానికి వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నాకాబందీ నిర్వహిస్తున్నారు. రాజు ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షలు బహుమానం ఇస్తామని […]
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సెంకండ్ వేవ్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 30,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. ఇందులో 3,25,60,474 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,42,923 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 38,303 మంది కోలుకున్నట్టు […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం కావడంతో దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఈ మొబైల్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు. రాబోయే 15 రోజుల […]
ఒక బండిపై ఇద్దరు ప్రయాణం చేయవచ్చు. అంతకంటే ఎక్కువ మంది ప్రయాణం చేస్తే ఫైన్ విధిస్తారు. అయితే, ఓ వ్యక్తి తన బండిపై ముగ్గురు నలుగురు కాదు ఏకంగా 13 మందిని ఎక్కించుకొని ప్రయాణం చేస్తున్నారు. ఒక బండిపై 13 మందిని ఎలా ఎక్కించుకున్నారు అన్నది ఆశ్చర్యంగా మారింది. ఆటో కూడా కాదు టూ వీలర్. అంతమందిని బండిమీద బ్యాలెన్స్ చేయడం అంటే మాములు విషయం కాదు. చివరకు ముందు చక్రంపై కూడా పిల్లలను కూర్చోపెట్టుకొని పాటలు […]
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పుత్తడి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం వివిధ నగరాల్లో పెత్తడి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,330గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,300గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల […]
2001 ముందు వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన అల్‌ఖైదా ఆ తరువాత సైలెంట్ అయింది. తన ఉనికి చాటుకుంటున్నప్పటికీ పెద్దగా దాని గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న 20 ఏళ్లు అ ఉగ్రవాద సంస్థ సైలెంట్‌గా ఉన్నది. కాగా, అమెరికా దళాలు తప్పుకోవడంతో మరలా తన ఉనికిని చాటుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అల్‌ఖైదా తిరిగి పుంజుకోవడానికి తాలిబన్లు సహకరిస్తున్నారని, పంజ్‌షీర్ ను వారి ఆధీనంలోకి […]
మేషం : వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడతుంది. పట్టువిడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలంగా ఉంటాయి. వృషభం : కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. రవాణా రంగంలోని వారికి చికాకులు తప్పదు. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం […]