పంజాబ్‌లో మరో కొత్త పార్టీ ఏర్పడబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్ సింగ్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకున్న అమరీందర్ సింగ్, ఢిల్లీలో బిజీగా మారిపోయారు. ఈరోజు కేంద్రంలోని అనేక మంత్రులను, ప్రధాని మోడిని కూడా కలిశారు అమరీందర్ సింగ్. కాగా, ఆయన ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండబోవడం […]
కరోనా సమయంలో నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి పెద్ద పీఠ వేసేదిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంతో పాటుగా స్వయం సమృద్ది సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోడి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని మోడి పేర్కొన్నారు. ఈరోజు రాజస్థాన్‌లోని […]
ముంబై శివారు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చిరుతలు దాడులు చేస్తున్నాయి. నిన్న కూడా ఓమహిళపై చిరుత దాడిచేసింది. అయితే, ఆ మహిళ చిరుతపై దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది. చేతి కర్ర సాయంతో చిరుతపై తిరగబడింది. కర్ర దెబ్బలకు తాళలేక ఆ చిరుత అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. నడుచుకుంటూ ఇంటికి తిరిగి వచ్చిన మహిళ ఇంటి వసారాలో కూర్చున్నది. అప్పటికే మూలన నక్కి ఉన్న చిరుత ఆ మహిళపై దాడిచేసింది. మహిళ అప్రమత్తంగా ఉండటంతో చిన్న […]
కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ వీడియో సెకండ్ కేటగిరికి చెందినదిగా చెప్పవచ్చు. అడవిలో ఓ మేక సంచరిస్తుండగా, ఓ వ్యక్తి బెర్రీ పండ్లను కోసి ఆ మేకను పిలిచాడు. మేక పరుగుపరుగున అక్కడికి వచ్చి ఆ యువకుడు అందించిన బెర్రీలను తింటోంది. అయితే, అప్పటి వరకు మేక మెడను గట్టిగా పట్టుకొని ఉన్న చిన్న కోతిపిల్ల కూడా […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యి నెల రోజులైంది. ఇప్పటి వరకు పాక్ మినహా ఏ దేశం కూడా అధికారికంగా ఆ దేశానికి విమానాలు నడపడం లేదు. దీంతో ఆ దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది. అంతర్జాతీయంగా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం గుర్తించలేదు. ఇక ఉదిలా ఉంటే, తాలిబన్లు మొదటిసారి భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖను రాశారు. అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన తరువాత ఖతర్ టెక్నాలజీని సపోర్ట్‌గా తీసుకొని ఎయిర్‌పోర్ట్‌ను […]
పంజాబ్ పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేసిన తరువాత పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సిద్ధూ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మంత్రులు కోరినా ఆయన వినలేదు. రాజీనామాపై పునరాలోచన లేదని అన్నారు. తన తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాటం చేస్తానని సిద్ధూ పేర్కొన్నారు. అవినీతి మరకలు అంటిన వ్యక్తులను ప్రభుత్వంలోకి తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. వ్యక్తిగత విషయాల కోసం జరిగే యుద్ధం కాదని, సిద్ధాంతాల కోసం జరుగుతున్న యుద్ధం అని, అవినీతి మరకలు […]
చైనాలో ఎవర్ గ్రాండ్ సంక్షోభం మరవక ముందే మరోక సంక్షోభం బయటకు వచ్చింది. కరోనా నుంచి చైనా బయటపడుతున్న సమయంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరెంట్ వినియోగం పెరిగిపోవడంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. వాణిజ్య పరమైన విద్యుత్ వినియోగం పెరగడంతో చివరకు వీధిలైట్లకు కూడా విద్యుత్‌ను కట్ చేశారు. 2020 తో పోలిస్తే 2021లో వినియోగం 13శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగినంతగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో […]
సిద్ధూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేయడం పట్ల పలువురు నేతలు ఆయన్ను విమర్శించడం మొదలుపెట్టారు. సిద్ధూపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూకి స్థిరత్వం లేదని, అనాడు ఇంగ్లాండ్‌లో భారత జట్టును వదిలేసి వచ్చినట్టుగానే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా మధ్యలో వదిలేసి ఆ పార్టీని నిండా ముంచేశాడని అన్నారు. […]
గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా దీంతో ఆయా ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసి నదికి పెద్ద మొత్తంలో వరద వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా నగరంలోని […]