జైళ్లశాఖ కొత్త డీజీగా డాక్టర్ జితేందర్ నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1982 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జితేందర్ లా అండ్ ఆర్డర్ డీజీ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జైళ్ల శాఖ డిజిగా ఉన్న రాజీవ్ త్రివేది ఇవాళ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో జైల్ శాఖ కొత్త డీజీ గా జితేందర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. – Ramesh Vaitla Read: జియో ఫిజిక్స్ ప్రొఫెసర్‌కు ఆ దేశ […]
ఎప్పుడు ఎవర్ని అదృష్టం ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేదు. ఒక దేశానికి ప్రధాని కావడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. దేశంలోని ప్రజల అభిమానాన్ని చొరగొనాలి. పార్లమెంట్‌లో మెజారిటీ సాధించాలి. పార్టీలో పట్టు ఉండాలి. అయితే, ఇవేమీ లేకుండానే ఓ మహిళకు ఆ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. అయితే, ఆమె పరిణితి చెందిన విద్యావేత్త. జియో ఫిజిక్స్ ప్రొఫెసర్. విద్యాశాఖ తరపుల ప్రపంచబ్యాంక్ నిర్వహించిన అనేక ప్రాజెక్టుల్లో ఆమె పాలుపంచుకున్నారు. ఆమె […]
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు సమయం దొరికినప్పుడల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపైనా, ఆర్ఎస్ఎస్ పైనా నిప్పులు చెరుగుతుంటారు. వారి మతరాజకీయాలపై విమర్శలు చేస్తుంటారు. అయితే, సడెన్‌గా దిగ్విజయ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపైనా, ఆర్ఎస్ఎస్‌పైనా ప్రశంసలు కురిపించారు. గతంలో వారు చేసిన సాయం గురించి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్ల క్రితం తాము నర్మదా పరిక్రమ యాత్రను చేస్తున్న సమయంలో అమిత్ షా, ఆర్ఎస్ఎస్‌లు గొప్ప సాయం చేశారని […]
భవానీపూర్ ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ తరపున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ప్రియాంక బరిలో ఉన్నారు. అయితే, ఇది ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం కావడంతో అమె విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ, బీజేపీ గట్టి పోటి ఇవ్వనుందని సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక జరిగే సమయంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మధ్య జరిగిన […]
పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతున్నట్టు ప్రకటించారు. కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్ సన్నీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ తన పదవికి రాజీనామా చేయడంతో మరోసారి పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. నేతలు బుజ్జగించినా ఆయన వినలేదు. రాజీనామాపై పునరాలోచన లేదని చెప్పిన సిద్ధూ సడెన్ గా ఈ రోజు ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ […]
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు అప్పుడప్పుడు సైకిల్ నగరంలో ప్రయాణం చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న స్టాలిన్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. పోలీస్ స్టేషన్‌లో పనితీరును తెలుసుకుకేందుకు అర్థరాత్రి సమయంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సేలం నుంచి ధర్మపురికి వెళ్తుండగా ఆయన మధ్యలో అద్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ స్టేషన్ పనితీరును రికార్డులను పరిశీలించారు. సీఎం ఇలా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనిఖీలు చేయడంతో […]
బద్వేల్ ఉప ఎన్నికలు అక్టోబర్ 30 వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో విజయం తమదే అని టీడీపీ ధీమాను వ్యక్తం చేసింది. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అభివృద్ది చేశారని టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎం జగన్ బద్వేల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు […]
అక్టోబర్ 30 వ తేదీన కడప జిల్లాలోని బద్వేల్ కు ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో జనసేప పార్టీ బద్వేల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు సమాచారం. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన కారణంగా ఈసారి బద్వేల్ నియోజక వర్గంలో పోటీ చేసే అవకాశం జనసేనకు ఇచ్చినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, జనసేన నుంచి ఎవరు పోటీలో ఉంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. […]
కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నికను అక్టోబర్ 30 వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. కాగా, రేపు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 30 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి […]