ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,870 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,37,16,451కి చేరింది. ఇందులో 3,29,86,180 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,82,520 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, భారత్‌లో కరోనాతో గడిచిన 24 గంటల్లో 378 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,47,751 మంది మృతి చెందినట్టు […]
జర్మనీలో చాన్సలర్ మెర్కెల్ 16 ఏళ్ల పాలనకు చెక్ పడనుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అంటున్నాయి. జర్మనీలో జరిగిన ఎన్నికల్లో మెర్కెల్ పార్టీకి 196 సీట్లు సాధించగా, ప్రతిపక్షంలో ఉన్న సోషల్ డెమోక్రాట్స్ పార్టీ 206 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, అనూహ్యంగా ఈ ఎన్నికల్లో గ్రీన్ పార్టీ 118 సీట్లు, ఫ్రీ డెమోక్రాట్ల పార్టీ 92 సీట్లు సాధించింది. ప్రధాన ప్రత్యర్థులైన క్రిస్టియన్ యూనియన్ పార్టీ, సోషల్ డెమోక్రాట్ల పార్టీలలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు […]
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జగరబోతున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ఎత్తులు వేస్తున్నది. ఇందులో భాగంగా సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పక్కకు తప్పించి ఆ స్థానంలో ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నికి అవకాశం ఇచ్చింది. దీంతో పంజాబ్‌లో సంక్షోభానికి తెరపడినట్టే అని అందరూ అనుకున్నారు. అయితే, సడెన్‌గా పంజాబ్ పీసీసీకి సిద్ధూ రాజీనామా చేశారు. ఆయనకు మద్ధతుగా ఓ మంత్రి, ఓ నేత […]
ఈరోజు జనసేప పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించబోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు, రోడ్ల మరమ్మత్తులు తదిత అంశాలతో పాటుగా, అక్టోబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో శ్రమదానం కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా, అక్టోబర్ 30 వ తేదీన బద్వేలుకు ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై […]
నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు తిగిరి తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు దిగి వస్తున్నప్పటికీ, వెండి మాత్రం పెరుగుతూనే ఉన్నది. తగ్గిన ధరల ప్రకారం నగరంలోని బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.43,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ.47,130 కి చేరింది. ఇక కిలో వెండి ధర […]
కరోనా ఇప్పటి వరకు పూర్తిగా తొలగిపోలేదు. నిత్యం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. భారత్‌తో సహా చాలా దేశాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు. అయితే, ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో మరణాల రేటు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. వ్యాక్సిన్ తీసుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వంటి అంశాల కారణంగా కరోనాను అదుపులో ఉంచవచ్చు. అయితే, కరోనా పూర్తిగా ఎప్పటి వరకు అంతం అవుతంది […]
మేషం:- సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. వృషభం:- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల వేధింపులు, సహోద్యోగులతో చికాకులు తప్పవు. ఏ విషయంలోనూ […]
పాక్‌లో ఉద్రవాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. పాక్‌లో ఉన్న ఆ ఉగ్రసంస్థలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో మారణహోమాలను సృష్టిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు పాక్ ఇంటిలిజెన్స్ సహకారం ఉందనన్నది బహిరింగ రహస్యమే. ఇక ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ పాక్‌లోని ఉగ్రసంస్థలపై కీలక పరిశోధన చేసింది. టెర్రరిస్ట్ అండ్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్థాన్ పేరిట ఓ నివేదికను తయారు చేసి క్వాడ్ సదస్సు రోజున రిలీజ్ […]
కూతురు ఎవరికైనా కూతురే. కన్నబిడ్డకోసం తల్లిదండ్రులు ఎంత కష్టం పడటానికైనా సరే సాహసిస్తారు. తన చిన్నారిని ఎలాగైనా కాపాడుకోవాలనే తలంపుతో ఆర్మీజవాన్ ఒట్టి కాళ్లతో నడక ప్రయాణం మొదలుపెట్టాడు. సీడిఎల్ఎస్ అనే అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతున్నది. జన్యలోపం వలన ఇలాంటి సీడిఎల్ఎస్ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేకపోవడంతో ఎలాగైనా సరే కాపాడుకోవడానికి ఆ చిన్నారి తండ్రి బ్రాన్నింగ్ కంకణం కట్టుకున్నాడు. హోప్ ఫర్ హస్తి పేరుతో ఛారిటీని స్థాపించి […]
కరోనా కారణంగా ప్రపంచంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ లక్షలాదిమంది ప్రజలు కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా మృతి చెందారు. ఆరోగ్య పరగంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రజల ఆయుర్థాయం భారీగా తగ్గిపోతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల ఆయుర్ధాయం భారీగా తగ్గిందని, కోవిడ్ తరువాత రెండోసారి భారీగా ప్రజల ఆయుర్థాయం తగ్గిపోయినట్టు పరిశోధకుల సర్వేలో తేలింది. మొత్తం 29 […]