గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా దీంతో ఆయా ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసి నదికి పెద్ద మొత్తంలో వరద వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా నగరంలోని మూసారంబాగ్ వంతెనను మూసివేశారు. మూసినదిలో వరద ఉధృతి తగ్గుముఖం పడితే వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. వంతెనపై ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read: ఇండియా కరోనా అప్డేట్: భారీగా తగ్గిన కేసులు…