2013 నవంబర్ 5 వ తేదీన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మంగళ్‌యాన్ ఉపగ్రహాన్ని మార్స్ మీదకు ప్రయోగించింది. మార్స్ మీదకు ప్రయోగించిన ఈ ఉపగ్రహం విజయవంతంగా 2014 సెప్టెంబర్ 24 వ తేదీన మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆరు నెలల పాటు కక్ష్యలో పరిభ్రమించేలా మామ్‌ను డిజైన్ చేశారు. అయితే, గత ఏడేళ్లుగా మామ్ పనిచేస్తూనే ఉన్నట్టు ఇస్రో శాష్ట్రవేత్తలు చెబుతున్నారు. అక్కడి నుంచి మామ్ ఉపగ్రహం ఇప్పటికీ డేటాను పంపుతూనే ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. […]
దేశంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారత్ బంద్ కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రభుత్వం ఈ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒకటే అని, అందుకే ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వడంలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి వచ్చారు. అయితే, అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్రపు బగ్గీని అనుమతించాలని […]
అనంతపురం జిల్లాల్లో గుప్తనిథుల కోసం తవ్వకాలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యాయి. పాత ఆలయాలు, పాత గృహసముదాయాలు కనిపిస్తే చాలు మూడో కంటికి తెలియకుండా గుప్తనిథుల వేటగాళ్లు తవ్వకాలు జరుపుతున్నారు. అనంతపురం జిల్లాలోని యాడికి మండలంలోని పుష్పాల-చింతలచెరువు ప్రాంతంలోని సుంకలమ్మ గుడికి సమీపంలో ఉన్నపాత బురుజు ప్రాంతంలోని పొలంలో రాత్రి సమయంలో తవ్వకాలు జరిపారు. అయితే, రాత్రి సమయంలో పొలం నుంచి వింత శబ్దాలు రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి చూసి షాక్ […]
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఆర్ఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది. అమెజాన్ కంపెనీ దేశంలో మరో ఈస్ట్ ఇండియా కంపెనీగా మారేందుకు ప్రయత్నం చేస్తోందని, ఆ కంపెనీ వ్యవహారాలు చూస్తుంటే ఆ విధంగానే కనిపిస్తోందని ఆర్ఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 18 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశాన్ని అక్రమించుకోవడానికి ఆ కంపెనీ చేసిన పనులే ఇప్పుడు అమెజాన్ కూడా చేస్తోందని, ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కోట్లాది రూపాయల ముడుపులను […]
అమెరికా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్‌గా భవనం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని ప్రధాని సందర్శించడంతో ఇంజనీర్లు షాకయ్యారు. దాదాపు గంటసేపు ప్రధాని మోడీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. పనితీరును అడిగి తెలుసుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలు కొత్త […]
ఇండియాలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నది. అయితే, రాబోయే 4నుంచి 6 వారాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 26,041 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,78,786కి చేరింది. ఇందులో 3,29,31,972 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, […]
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, గచ్చిబౌలీ, రాజేంద్రనగర్, జీడిమెట్ల, కొంపల్లి, కుత్భుల్లాపూర్, అంబర్‌పేట్ తో పాటుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టుప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తుఫాన్ […]
రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలొని అనేక ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టుగా భారత గనులశాఖ గుర్తించింది. రాయగిరి సమీపంలో గతంలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ కు గనులు ఉండేవి. అయితే, 2001 నుంచి గనుల తవ్వకాలను నిలిపివేశారు. అయితే, ఇప్పుడు ఈ గనులకు సమీపంలో మరో రెండు ప్రాంతాల్లో, రొద్దం మండలంలోని బొక్సంపల్లిలోని రెండు ప్రాంతాల్లో, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో 6 ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టుగా గుర్తించారు. గనులు ఉన్నట్టుగా గుర్తించిన ప్రాంతాల్లో ఒక […]
రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన సహచరుల్లో అనేకమందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తలో భాగంగా ఆయన సెల్ష్ ఐసోలేషన్‌కు వెళ్లారు. సెర్బియా ప్రాంతంలో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఐసోలేషన్ సమయంలో పుతిన్ అక్కడే ఉన్న ప్రవాహంలో చేపలు పడుతూ, అడ్వెంచర్ డ్రైవింగ్ వంటి ప్రయాణాలు చేస్తున్నట్టు అధ్యక్షుడి అధికార నివాసం కెమ్లిన్ తెలియజేసింది. దీనికి సంబందించిన ఫొటోలను కూడా రిలీజ్ చేశారు. గతంలో కూడా పుతిన్ కొన్నిరోజులు […]