సిమ్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయం అయ్యాయి. కొండలకు అనుకొని ఉన్న భవనాల్లో నివాసం ఉంటున్న ప్రజలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. ఎప్పుడు కొండచరియలు విరిగిపడతాయో, ఎప్పుడు భవనాలు కూలిపోతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా పగుళ్ళు ఏర్పడిన ఓ 8 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. భవనానికి పగుళ్లు రావడంతో అందులో నివశిస్తున్న […]
1918 అనగానే మనకు మొదటి ప్రపంచ యుద్ధం, స్పానిష్ ఫ్లూ గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో జన్మించిన ఇప్పటి వరకు జీవిస్తున్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అమెరికాకు చెందిన ప్రీమెట్టా రెండు రకాల మహమ్మారులను చూసింది. స్పానిష్ ఫ్లూ విస్తరిస్తున్న సమయంలో ఆమె రెండేళ్ల చిన్నారి. ఆ ఫ్లూను సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జన్మించిన ప్రీమెట్టా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గోన్న వ్యక్తిని వివాహం చేసుకున్నది. సామాజిక సేవకురాలిని […]
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా అమలు చేస్తుండటంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వందశాతం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఏడాది వరకు ఉంటాయని, బూస్టర్ డోసుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ తెలిపారు. దేశంలో అనేక వ్యాక్సిన్లు ప్రస్తుతం అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాడిలా ఫార్మా తయారు చేసిన జైకోవ్ డి మూడో డోసుల వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్‌లోకి […]
దేశంలో పుత్తడి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటుగా, దేశీయంగా మార్కెట్లు జోరు పెరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీని ప్రభావం బంగారంపై పడింది. తాజాగా తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.43,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ.46,960కి […]
దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అని చెప్తాం. ఆయన నికర ఆస్తుల విలువ 7,18,000 కోట్లు. ప్రతిరోజు ఆయన కుటుంబం సంపాదన రూ.163 కోట్లు పెరుగుతున్నట్టు ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక తెలియజేసింది. అయితే, దేశంలో సంపన్నుల లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్న ఆదాని రోజువారి ఆదాయం విషయంలో ముఖేష్ అంబాని కుటుంబాన్ని దాటేశారు. ముఖేష్ అంబాని కుటుంబానికి అందనంతగా భారీగా ఆదాయన్ని పెంచుకుంటున్నారు. గౌతమ్ ఆదానీ కుటుంబం ప్రతిరోజు […]
పంజాబ్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయకముందు ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా బయటకు రాలేదు. ఎప్పుడైతే అమరీందర్ సింగ్ రాజీనామా చేశారో అప్పటి నుంచి అంతర్గత కలహాలు బగ్గుమన్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేయడంతో మరో డ్రామా నడిచింది. కొత్త ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు నచ్చడం లేదని, తాన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పిన సిద్ధూ, […]
మేషం:- ఉద్యోగస్తులకు అడ్వాన్లు, బోనస్, సెలవులు మంజూరవుతాయి. దైవ దీక్షలు స్వీకరిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్తయత్నాలు మొదలెడతలారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు సదవకాశాలు చేజారిపోతాయి. వృషభం:- బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే […]
ఉత్తర కొరియా గురించిన ఎలాంటి చిన్న వార్త బయటకు వచ్చినా అది వెంటనే వైరల్ గా మారటం సహజమే. ఆ దేశంలో జరిగే విషయాలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటాయి. గత కొంతకాలంగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని వార్తలు అధికంగా వచ్చే సమయంలో ఆయనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రచురిస్తుంటుంది. అయితే, ఆయన ఆకారంలో వచ్చిన మార్పులను బట్టి కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇక ఇదిలా […]
అమరీందర్ సింగ్ ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి పంజాబ్ చేరుకున్నారు. పంజాబ్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితిపై ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అనిశ్చితి పరిస్థితి నెలకొందని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని కోల్పోతే స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పటికే పార్టీలో సిద్ధూని అనేక మంది వ్యతిరేకిస్తున్నారని, నిలకడ లేని మనస్థత్వం కలిగిన […]
జగన్ తల్లి వైయస్ విజయమ్మ సోదరి, షర్మిల ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఊరట లభించింది. 2012లో పరాకల లో ఏర్పాటు చేసిన సభకు అనుమతికి సంబంధించిన కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభ ఏర్పాటు చేశారన్న అభియోగాలపై షర్మిల, విజయమ్మపై అప్పుడు కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కొండా సురేఖ కొండా మురళి తో పాటుగా తొమ్మిది మంది పైన పోలీసులు కేసు నమోదు […]