తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరొకరి అరెస్టు జరిగింది. దీంతో తెలుగు అకాడమీ కేసులో అరెస్టుల సంఖ్య 16కు చేరింది. బ్యాంకు నుంచి డబ్బులు కొల్లగొట్టాలని ప్లాన్ కృష్ణారెడ్డిదే అని తెలుస్తోంది. సాయి కుమార్ కు సలహా ఇచ్చినందుకు రెండున్నర కోట్లు తీసుకున్నాడు కృష్ణారెడ్డి. మొదట్లో కృష్ణారెడ్డి సాయికుమార్ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్ల కొల్లగొట్టడం పై సమావేశాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో వాటాను డిమాండ్ చేయడంతో […]
సిరిమాను సంబరానికి అంతా సిద్ధమయింది, ఉత్తరాంధ్ర కల్పవల్లి పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి విజయనగరం జిల్లా ముస్తాబైంది. కరోనా కారణంగా పైడిమాంబ ఉత్సవాలను గతంలోలా కాకుండా చాలా సాదాసీదాగా జరపనున్నారు. రెండో ఏడాదీ భక్తులు లేకుండానే అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారిని కనులారా వీక్షించే అవకాశం లేకుండా పోయిందని భక్తులు వాపోతున్నారు. ఇదిలా వుంటే.. సిరిమాను ఊరేగింపునకు సర్వం సిద్ధం అయింది. కోట బురుజుపై చేరుకున్నారు రాజవంశీయులు అశోక్ గజపతి రాజు కుటుంబసభ్యులు. […]
గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని విశాఖ రేంజ్ డిఐజి రంగారావు చెబుతున్నారు. గత రెండు మూడు వారాలు గా ఇతర రాష్ట్రాల పోలీసులు విశాఖకు వస్తున్నారని, గంజాయి కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ నల్గొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. దాని వల్ల ఫైరింగ్ సమస్య తలెత్తిందన్నారు. కేరళ,తమిళనాడు,కర్ణాటక పోలీసుల సైతం వచ్చి నిందితుల […]
తూర్పుగోదావరి జిల్లా పోలవరం నిర్వాసిత గ్రామవాసులు కంటిమీద కునుకు లేకుండా జీవితాలు గడుపుతున్నారు. సీతారం ఆర్ &ఆర్ న్యూ కాలనీ జనావాసాల్లోకి భారీ కొండ చిలువ రావడంతో భయంతో పరుగులు తీశారు గ్రామస్తులు. ఆత్మ రక్షణ కోసం వాటిని హతమారుస్తున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో అర కొర సదుపాయాలతో నిర్మించిన కాలనీలు జనం పాలిట శాపంగా మారుతున్నాయి. అక్కడ కనీస సదుపాయాలు లేవు. వీధి దీపాలు లేవు,సిమెంట్ రోడ్లు లేవు,డ్రైనేజి వ్యవస్థ అసలే కనిపించడం లేదు,ఊరంతా నీటి […]
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పునరుద్దరించలేదని టీటీడీ తెలిపింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం […]
యాదాద్రి: యాదగిరిగుట్టలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ .. హుజురాబాద్‌లో దళిత బంధును అడ్డుకునేది బీజేపీనే అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని గెలిచేది టీఆర్‌ఎస్‌యే అని పేర్కొన్నారు. కావాలనే బీజేపీ దళిత బంధును అడ్డుకుందని తెలిపారు. బీజేపీ అండతో ఈటల ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మాత్రం టీఆర్‌ఎస్ యే అన్నారు. రానున్న రోజుల్లో యావత్ దేశమే కేసీఆర్ బాటలో నడవనుందని […]
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ ప్రయత్నిస్తున్నది. అవకాశం ఉన్న ఏ అంశాన్ని కూడా వదుకుకోవడంలేదు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ప్రియాంక గాంధీ తన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. రైతుల నిరసలకు మద్ధతు తెలపడమే కాకుండా వారితో కలిసి పోరాటం చేశారు. లఖింపూర్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరు, పోరాటం చేసిన విధానం ఆ పార్టీకి కొంతమేర […]
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతున్నారనే వార్తలపై ఆయన స్పందిస్తూ .. అది కేవలం వాట్సాప్ యూనివర్సీటీ ప్రచారం మాత్రమేనని ఇలాంటి గ్లోబల్ ప్రచారాలను ఎవ్వరూ నమ్మోద్దన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడమనేది సందర్భానుసారాన్ని బట్టి ఉంటుందన్నారు. వాట్సాప్ లో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దెశిస్తూ కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎందుకు రాజకీయ సన్యాసం […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అయితే, ప్రపంచ దేశాల గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అయినప్పటికీ ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడంతో ఇబ్బందులు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నది. ఇక ఆఫ్ఘన్ భవితవ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. ఒకరు అమెరికా రాయబారి జల్మే ఖలిల్జాద్, ఘని, స్టానిక్జాయ్. ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారు. కానీ, ఇప్పుడు వీరు తీవ్రమైన […]
సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే యాదాద్రి చేరుకున్నారు. కేసీఆర్ ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ పున:నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. మహా సుదర్శన యాగాల తేదిలతో పాటు ఆలయ పున: ప్రారంభ తేదిలను కూడా నేడు ప్రటించే అవకాశం ఉంది. మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు, సీఏఓం అధికారులు పాల్గొన్నారు. ఆలయ పనులతో […]