కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతున్నారనే వార్తలపై ఆయన స్పందిస్తూ .. అది కేవలం వాట్సాప్ యూనివర్సీటీ ప్రచారం మాత్రమేనని ఇలాంటి గ్లోబల్ ప్రచారాలను ఎవ్వరూ నమ్మోద్దన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడమనేది సందర్భానుసారాన్ని బట్టి ఉంటుందన్నారు. వాట్సాప్ లో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దెశిస్తూ కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకోలేదని ఎద్దేవా చేశారు.