యాదాద్రి ఆలయం పునఃప్రారంభం కాబోతున్న తరుణంలో ఆలయంలోని విమాన గోపురం స్వర్ణమయం కాబోతున్నది. ఈ విమాన గోపురం స్వర్ణతాపడం కోసం అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ 2కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకొని అనేక మంది దాతలు బంగారాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కాసుమన్ కిలో బంగారం, జలవిహార్ ఎండీ కిలో బంగారం, హెటిరో గ్రూప్ 5 కిలోల బంగారం, […]
జాతీయ భద్రత, పౌరుల వ్యక్తిగత గోప్యత కోసం కేంద్ర ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. అందులో వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్ కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు తయారుచేసే స్మార్ట్ ఫోన్లలో వాడే వివిధ సాంకేతిక అంశాలను తెలియచేయాలని కేంద్రం నోటీసులిచ్చింది. ఫోన్లలో వాడే హార్ట్ వేర్, సాఫ్ట్ వేర్ వివరాలు, ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్, […]
వైఎస్ షర్మిల ఈరోజు నుంచి ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. చేవెళ్ల నియోజక వర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం అయింది. ఈ యాత్రకు ముందు వైఎస్ షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె తప్పుపట్టారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీపై షర్మిల విరుచుకుపడ్డారు. తాము దీక్షలు చేస్తేనే కేసీఆర్‌కు ఉద్యోగ భర్తీలు గుర్తుకు వస్తాయని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌ను అరువుతెచ్చుకొని అధ్యక్షుడిని చేసిందని, […]
శ్రీ పీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణనంద కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు మారుతున్నా దాడులు ఆగడం లేదన్నారు పరిపూర్ణానంద. దేవాలయాల పరిరక్షణ కోసం సామాజిక సృహ పెరగాలన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై మారణకాండ అత్యంత పాశవికం అన్నారు. కరోనా ఆంక్షలు పేరుతో హిందూ పండగలను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. కరోనా ప్రభుత్వానికి పట్టింది.. సమాజానికి పట్టలేదన్నారు. దేవాలయ భూములు హిందువులే కోల్పోతున్నారని, మతమార్పిడులు ఇప్పటికిప్పుడు జరగడం లేదు. దశాబ్దాలుగా జరుగుతూనే […]
శీతాకాలం ఆరంభానికి ముందే హిమాచల్ ప్రదేశ్, హిమాలయ ప్రాంతాల్లో మంచు కురుస్తున్నది. మంచుదుప్పట్లు కప్పేయడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఇండియా చైనా బోర్డర్‌లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ కి పడిపోతాయి. అలాంటి సమయంలో అక్కడ పహారా నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఎంతటి కఠినమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకొని భారత సైనికులు కాపలా కాస్తుంటారు. అయితే, ఇటీవలే ఇండియా చైనా దేశాల మధ్య 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి […]
టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడి తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక నిరసన దీక్షకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు బాబు. రేపు ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్షకు దిగుతున్నారు చంద్రబాబు. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్షకు అన్ని […]
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామిపక్కదేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఖండించడం లేదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. చైనా లద్దాక్‌ను ఆక్రమించడానికి వచ్చినప్పుడు దూకుడు ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలన్నారు.ఆప్ఘన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారన్నారు. బంగ్లా మరో ఆప్ఘాన్ కాకముందే భారత ప్రభుత్వం స్పందించి బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువుల హక్కులను కాపాడాలన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వంత పార్టీ […]
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఏపీ సీయం జగన్. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో 11,775 వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. నేడో, రేపో ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కొత్తగా పీహెచ్‌సీల నిర్మాణం జరుగుతుండటంతో ఈ పోస్టులకు అదనంగా మరో3,176 భర్తీకి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. వీటికి కూడా వెంటనే నోటిఫికేషన్ విడుదల […]
స్మార్ట్ ఫోన్ల విభాగంలో దూసుకుపోతున్న లాట్‌షోరూం నూతన ప్రచారకర్తగా రష్మిక మందన నియామాకం అయ్యారు. ఇప్పటికే 150 స్టోర్లకు చేరువలో చేరి ఎప్పటికప్పుడు నూతన మొబైల్స్‌ను వినియోగదారులకు అందిస్తున్నారు షోరూం నిర్వాహకులు. లాట్ మొబైల్స్ (NO QUESTION ASKED) ASSURED PAY BACK విధానాన్ని పాటిస్తూ, పాత మొబైల్స్ స్థానంలో కొత్త మొబైల్స్‌ను అందజేస్తుందన్నారు. కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు (90 Mins Delivery App) ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రచారకర్తగా నియామాకం అయిన రష్మిక […]
ఉత్తర ప్రదేశ్‌లో రాబోయే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని తృణముల్ కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. టీఎంసీ గత ఎన్నికల్లో 40శాతం సీట్లను మహిళలకు కేటాయించి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇప్పటికే దీని పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ క్లారీటీ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ పార్టీ వ్యవహరాలను ప్రియాంక గాంధీకి అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది.40 శాతం సీట్లను మహిళలకు కేటాయించేలా ఆమె అధిష్టానాన్ని ఒప్పించనున్నారు. ఏ పార్టీలో […]