గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని విశాఖ రేంజ్ డిఐజి రంగారావు చెబుతున్నారు. గత రెండు మూడు వారాలు గా ఇతర రాష్ట్రాల పోలీసులు విశాఖకు వస్తున్నారని, గంజాయి కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ నల్గొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. దాని వల్ల ఫైరింగ్ సమస్య తలెత్తిందన్నారు.
కేరళ,తమిళనాడు,కర్ణాటక పోలీసుల సైతం వచ్చి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు కొన్ని విషయాలు మాట్లాడారన్నారు. మాఫియా ఉందన్నారు..ఆ విషయాలు చెప్పాలని కోరాం. దీనిపై ఆయన మాట్లాడిన విషయాలపై పూర్తి వివరాలు ఇవ్వమని అడిగామన్నారు విశాఖ రేంజ్ డీఐజీ.
నక్కా ఆనందబాబు వివరాలు ఇవ్వలేక పోయారు .ఆయనను ఓ సాక్షిగా పరిగణించి సీఆర్పిసీ 160 ప్రకారం నోటీసులు ఇచ్చామన్నారు. గంజాయి అనేది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదని, దీనిపై ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాం, కేసులు నమోదు చేసామన్నారు. అన్ని శాఖలు గంజాయి నివారణ కోసం కష్టపడుతున్నాయన్నారు. ప్రభుత్వం గంజాయి నివారణ కోసం ప్రయత్నం చేస్తుందని, గంజాయి గురించి ఏ సమచారం ఉన్నా ఎవరైనా అందించ వచ్చన్నారు. ఇది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా అన్నారు. గంజాయి పంటలను సైతం ధ్వంసం చేస్తామన్నారు.
గంజాయి నిందితుల కోసం తెలంగాణ పోలీసులు వచ్చారని కానీ వారిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వకుండా నేరుగా వెళ్ళారన్నారు విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు చెప్పారు. ఈ నేపద్యంలో వారిని తీసుకొచ్చే క్రమంలో వారంతా అడ్డుకున్నారని, తప్పనిసరి పరిస్థితులల్లో వారు పైరింగ్ చేసారని వివరణ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని వివరించారు.