షార్ట్ సర్క్యూట్ కారణంగా గాంధీ ఆస్పత్రిలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆస్ప్రతి సిబ్బంది, రోగులు బయటకు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ) రమేష్ రెడ్డి ఆస్ప్రతిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది 15 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆస్పత్రిసిబ్బంది, రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఆస్పత్రిలో ఉపయోగించే పరికరాలు పాడవ్వలేదన్నారు రమేష్ రెడ్డి . 120 మంది పేషంట్లను […]
ఉత్తరాఖండ్‌లోని వరదలు, అందుతున్న సాయం పై పరిశీలించేందుకు నేడు అమిత్ షా వెళ్లనున్నారు. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు బ్లాక్ అయ్యాయి. మరికొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇప్పటికే కొండ చరియలు విరిగిపడి శిథిలాల కింద చిక్కుకున్న 42 మందిని కాపాడారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దమానీ వరద నష్టాన్ని మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పుష్కర్ సింగ్ ఫోన్‌లో మాట్లాడి సహాయాన్ని అడిగారు. […]
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆదేశ రచయిత్రి తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పై మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ మత చాంధస్స వాదులు హిందువుల ఇళ్లను, షాపులను నాశనం చేశారన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు. ప్రధాని షేక్ హసీనా మత చాంధస్స వాదంలోకి వెళ్తున్నారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు ఉన్నారని వారిపై దాడులు సరికాదన్నారు. బంగ్లాదేశ్‌లో కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాల వారు […]
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప్రతి అగ్నిప్రమాదం జరిగింది.. లేబర్ రూమ్‌లోషార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్రమంగా మంటలు థర్డ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. ఊహించని ఘటనతో షాక్ తిన్న సిబ్బంది, రోగులు.. భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. పలువురు రోగులు ఆస్పత్రిలోపలే ఉండిపోయారు.. దీంతో మంటల్లో చిక్కుకు పోయిన రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే […]
మధ్యప్రదేశ్‌లో మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్-నబీ ఉరేగింపులో మంగళవారం అల్లర్లు చెలరేగాయి. మధ్యప్రదేశ్ లోని దార్, భర్వాని, జబల్‌పూర్ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కూడా తీవ్రంగా అల్లర్లు చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు.
కోవిడ్ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచినా.. మళ్లీ కోవిడ్ తగ్గడంతో ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన, పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలతో సామాన్యులు సతమతమవుతుంటే తాజాగా, చలికాలం ప్రారంభం కావడంతో రైళ్లలో ఇచ్చే బెడ్‌షీట్లు, దుప్పట్లు కావాలంటే జేబులకు చిల్లులు పడనున్నాయి. ఇకనుంచి రైల్వే శాఖ రూ.30 నుంచిరూ.300 వరకు ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నది. వాస్తవానికి కోవిడ్‌కు ముందు బెడ్‌షీట్లు,దుప్పట్లు రైల్వే శాఖనే ఉచితంగా ఇచ్చేది. ఢీల్లీతో సహా పలు రైల్వే స్టేషన్లలలో డిస్పోజబుల్ […]
వరుస వరదలతో ఉత్తరాఖండ్ విలవిలలాడుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అక్కడి జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. రాష్ట్రంలోని నైనితాల్ నదీ ఉగ్రరూపం కారణంగా 30 మంది మరణించారు. చంపావత్ నదీ ప్రవాహం […]
రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులు దారుణంగా వున్నాయని మండిపడ్డారు టీడీపీ నేతలు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా? ఇదెక్కడి అన్యాయం..ముఖ్యమంత్రి గారూ ఒక్కసారి ఆలోచించండి అన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రజా సమస్యల దృష్టి మరల్చడానికే ఈ చర్యలా.. !? అని గంటా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య […]
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే వుంటాయి. అందులోనూ విజయనగరంలో పూసపాటి వారి ఇంట రాజకీయాల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. విజయనగరంలో ప్రతి ఏడాది నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి తనను ఆహ్వానించలేదని చెబుతున్నారు మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్ పర్సన్ సంచయిత. ఈమేరకు ఆమె ట్విట్టర్ లో స్పందించారు. ఈ సిరిమానోత్సవం రోజున పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అని అభిలషించారు. మన హృదయం నిర్మలంగా ఉంటే అమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని […]
తెలంగాణలో జరగబోయే హుజూరాబాద్ ఎన్నికలపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. తెలంగాణాలో జరిగే ఎన్నికలు పగటి డ్రామాలా లేక పవిత్ర ఎన్నికల విధానాలా అని విమర్శించారు. ఎన్నికల విధానాలను భ్రష్టు పట్టించేవిగా వున్నాయన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగం గానే దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని, అయితే అందులో కూడా దళిత బంధు ఇచ్చినట్టే వుండాలి. పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు అందకూడదన్న చందంగా తయారైందన్నారు. కూడు కుండనిండుగుండాలి , బిడ్డమాత్రం బొద్దుగుండాలి ” అన్నట్టుగా వుందన్నారు నారాయణ. ఈనాటకాలలో […]