తెలుగు అకాడమీ కేసులో 16కి చేరిన అరెస్టుల పర్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరొకరి అరెస్టు జరిగింది. దీంతో తెలుగు అకాడమీ కేసులో అరెస్టుల సంఖ్య 16కు చేరింది. బ్యాంకు నుంచి డబ్బులు కొల్లగొట్టాలని ప్లాన్ కృష్ణారెడ్డిదే అని తెలుస్తోంది. సాయి కుమార్ కు సలహా ఇచ్చినందుకు రెండున్నర కోట్లు తీసుకున్నాడు కృష్ణారెడ్డి.
మొదట్లో కృష్ణారెడ్డి సాయికుమార్ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్ల కొల్లగొట్టడం పై సమావేశాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో వాటాను డిమాండ్ చేయడంతో కృష్ణా రెడ్డిని పక్కన పెట్టాడు సాయి కుమార్. చివరకు ఇద్దరూ ఒక్కటయ్యారని సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడయింది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
తెలుగు అకాడమీ కేసు రెండు రాష్ట్రాల్లో దుమారం రేపింది. ఇప్పటివరకూ పరారీలో ఉన్న కృష్ణారెడ్డిని సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన కృష్ణారెడ్డి.. కూకట్ పల్లిలోని నిజాంపేట్‌లో నివాసం ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. తెలుగు అకాడమీ డిపాజిట్లలో తన వాటాగా కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రాగా, పోలీసుల విచారణలో మాత్రం 3.5 కోట్లు తీసుకున్నట్లు కృష్ణారెడ్డి చెబుతుండడం కొసమెరుపు. ఏపీ వేర్ హౌసింగ్ లో 10కోట్లు, ఏపీ సీడ్స్ కార్పోరేషన్ 5కోట్ల స్కాం లోనూ కృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ దోచుకున్న డబ్బుని నిందితులు ఏం చేశారనేది అంతుపట్టని మిస్టరీగా మారింది. ఎక్కడ దాచారు. ఎందులో పెట్టుబడులు పెట్టారనే అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ గోల్ మాల్‌లో ప్రధాన నిందితుడైన సాయికుమార్ 35 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది.
మరో నిందితుడు వెంకటేశ్వర్‌రెడ్డి కూడా సత్తుపల్లిలో ఓ భారీ బిల్డింగ్ కొనుగోలు చేశాడని దర్యాప్తులో తెలుస్తోంది. తెలుగు అకాడమీ డిపాజిట్లతో ఆర్థిక మోసాలకు పాల్పడిన నిందితుల ఆస్తులను గుర్తించిన ఈడీ అధికారులు వాటిని జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన విధంగా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్న చందంగా మారింది.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?