నాసా త్వరలోనే చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపి అక్కడ పరిశోధనలు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే అమెరికా చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపింది. ఆ తరువాత, చంద్రమండల ప్రయాణాలను పక్కన పెట్టి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నారు. 2024 వరకు చంద్రుడి మీద కాలనీలు ఏర్పాటు చేయాలని నాసా ప్లాన్ చేస్తున్నది. దీనికి అవసరమైన సామాగ్రిని భూమి నుంచే చంద్రుడి మీదకు చేర్చాల్సి ఉంటుంది. ఇక, కాలనీలు ఏర్పాటు చేసినప్పటికి […]
బద్వేల్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 30 వ తేదీన బద్వేల్ ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీతో ఉన్న పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేప పోటీ నుంచి తప్పుకున్నది. అటు తెలుగుదేశం పార్టీ కూడా ఉప […]
రోజు రోజుకు పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ రూ.100కు పైనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాల్లో బతుకు జీవుడా అంటూ జీవీతాలను గడిపే సామాన్యులు పెరిగిన ధరలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు కంపెనీల్లో మార్పుల వల్ల దేశీయచమురు కంపెనీల ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.9 గా ఉండగా, డీజీల్ ధర103.18 గా […]
బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస కొనసాగుతూనే ఉన్నది. చిట్టగాంగ్ డివిజన్‌లోని కుమిల్లాలో దుర్గాపూజ సందర్భంగా వేదిక వద్ద కొంతమంది వ్యక్తులు చేసిన మత దూషణ కారణంగా హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల అంశం సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాలపైనా, హిందువుల ఇళ్లపైనా దాడులు జరుగుతున్నాయి. తాజాగా రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాజిపారాలో గ్రామంలో హిందూవులకు చెందిన 29 ఇళ్లను తగలబెట్టారు. గ్రామంలోని 20 గడ్డివాములకు సైతం […]
మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజును మిలాద్ ఉన్ నబీ గా జరుపుకుంటారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పాతబస్తీలోని ప్రధానమైన రహదారుల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. మిలాద్ ఉన్ నబీ కి ముందురోజే మసీదులు, మైదానాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మహ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను వివరిస్తారు. ఇక ఈరోజు ఉదయం నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా, మిలాద్ ఉన్ నబీ రోజున చార్మినార్ నుంచి మొఘల్ పురా […]
తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు కొరత లేదని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్టాలకు సైతం తగినంత బొగ్గు సరాఫరా చేస్తున్నట్టు తెలిపారు. రానునున్న రోజుల్లో బొగ్గు నిల్వలను పెంచడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తున్నామన్నారు. సింగరేణి భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగరేణి సంస్థ డైరెక్టర్లు,11మంది ఏరియాల జనరల్ […]
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చిందో అప్పటి నుంచే కార్మికులు, ఉద్యోగులు నిరసనబాట పట్టారు. వివిధ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు కార్మికుల నిరసనలకు మద్దతు ఇస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం నేటికి 250 రోజులు పూర్తయింది. దీంతో ఈరోజు 250 మందితో25 […]
ఒలింపిక్స్ సమయంలో కరోనా మహమ్మారి జపాన్ దేశాన్ని వణికించేసింది. కొత్త కేసులతో వణికిపోయింది. ఎలాగోలా కరోనా సమయంలోనే ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఒలింపిక్స్ ముగిసిన కొద్ది నెలల వ్యవధిలోనే కరోనా మహమ్మారిపై జపాన్ అతిపెద్ద విజయం సాధించింది. కరోనాను కట్టడి చేయడంతో విజయవంతం అయింది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాల్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నది. అయితే, జపాన్‌లో అందుకు భిన్నంగా కేసులు కంట్రోల్ కావడం […]
మేషం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ఆదరణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. క్లిష్ట సమయంలో మీ శ్రీమతి సహాయం లభిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దైవ పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. వృషభం :- వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదలతో శ్రమించండి, సత్ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలోను, సంఘంలోను మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలకు పనివారలతో […]
పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో ఎన్డీయే ప్రభుత్వంలో పర్యావరణ, అటవీశాఖ వాతావరణ మార్పుల సహాయశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, ఆగస్టులో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడికి, బాబుల్ సుప్రియోకి మద్య రగడ కారణంగానే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న బాబుల్ సుప్రియో, బెంగాల్ ఎన్నికల తరువాత బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. […]